Peddi Release Date: పవన్ కళ్యాణ్ కోసం వెనక్కి తగ్గిన రామ్ చరణ్ ..‘పెద్ది' అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే..

Peddi Release Date: మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)ప్రతిష్టాత్మక మూవీపెద్ది (Peddi)విడుదల తేదీపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఉప్పెన ఫేమ్, దర్శకుడు బుచ్చి బాబు సనా (Buchi Babu Sana) అధికారికంగా స్పందిస్తూ పెద్ది సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మొదట ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ, పరిస్థితులు మారడంతో డేట్ మార్పు జరిగింది.

ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)ను మార్చి 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే పెద్ది టీమ్ కూడా తమ కొత్త రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేయడంతో... రెండు సినిమాల విడుదలపై సాగిన ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. నెల రోజుల గ్యాప్‌లోనే మెగా ఫ్యామిలీకి చెందిన రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి రావడంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది.

Peddi Release Date Ram Charan Shifts Film for Pawan Kalyan Peddi Arrives on April 30

సోషల్ మీడియా మొత్తం 'ఉస్తాద్ భగత్ సింగ్', 'పెద్ది', పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లతో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ చరణ్ కాస్త వెనక్కి తగ్గాడనే టాక్ ఇప్పుడు వైరల్.

'గబ్బర్ సింగ్' కాంబో రిపీట్
పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ .. ఇది పవన్ కళ్యాణ్‌కు బ్లాక్‌బస్టర్ ఇచ్చిన గబ్బర్ సింగ్ కాంబో కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాను మైత్రి మూవీస్ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. హీరోయిన్లుగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విడుదల చేసిన పోస్టర్‌లో పవన్ వింటేజ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతేడాది సెప్టెంబర్‌లో ఓజీ (OG) తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారా అన్న ఆసక్తి నెలకొంది.

'పెద్ది'పై భారీ అంచనాలు
ఇక పెద్ది విషయానికి వస్తే దర్శకుడు బుచ్చిబాబు సానా గత చిత్రాల్లో చూపించిన ఎమోషనల్ డెప్త్, పవర్‌ఫుల్ కథనం కారణంగా ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏప్రిల్ 30 రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో హైప్ మరింత పెరిగింది. సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ కూడా ఈ సినిమాకు కలిసి వచ్చేలా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను ఆకట్టుకునేలా గ్రాండ్ స్కేల్‌లో పెద్ది రూపొందుతోందని ఇండస్ట్రీ టాక్. మొత్తానికి మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్, ఏప్రిల్ 30న పెద్ది... నెల రోజుల వ్యవధిలోనే మెగా క్యాంప్ నుంచి రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి. ఇది అభిమానులకు డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X