Peddi Trailer Review: పెద్ది మూవీ ట్రైలర్ రివ్యూ
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ముంబైలో గ్రాండ్‌గా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? అంచనాలను అందుకొన్నదా? ఈ ట్రైలర్‌లో ఆకట్టుకొనే అంశాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..

మెగా అభిమానులు, సగటు ప్రేక్షకులు ఊహించినట్టుగానే ఎమోషన్స్, యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో కొత్తదనం నిండిన స్పోర్ట్స్, రూరల్ డ్రామా తెరపైకి రాబోతున్నదనే విషయాన్ని పెద్ది ట్రైలర్ స్పష్టం చేసింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ యాక్టింగ్ స్టామినాను మరోసారి ఆవిష్కరించే ప్రయత్నం చేశారని బుచ్చిబాబు తన దర్శక ప్రతిభను చూపించారని ట్రైలర్‌లో జొప్పించిన సన్నివేశాలు చెప్పకనే చెప్పాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచేలా చేసిందనే నూటికి నూరుపాళ్లు సత్యం అనే చెప్పాలి.
ఇక పెద్ది ట్రైలర్‌లో డైలాగ్స్ మెగా పవర్‌ను చూపించాయి. గ్రామంలోని 'కుర్రాళ్లలో ఫేవరేట్ ప్లే మారుతున్నది. కానీ ఫేవరేట్ ప్లేయర్ మారడం లేదు', పెద్ది ఊరిలో దేవుడు కాదు.. గ్రౌండ్‌లో దేవుడు అంటూ పెద్ది క్యారెక్టర్‌కు ఇచ్చిన ఎలివేషన్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ట్రైలర్‌లో పెద్ది క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఆట గెలవడం కాదు.. బతకడం కావాలి అంటూ శివరాజ్ కుమార్ పాత్రను, వాళ్లకు ఆటాడటమే తెలుసు. మనకు ఆటాడించడం తెలుసు అని దివ్యేంద్ర శర్మను పరిచయం చేసిన విధానం హైలెట్‌గా ఉంది.
రాంచరణ్ పెర్ఫార్మెన్స్ మరో రేంజ్‌లో ఉండబోతుందనే విషయాన్ని డైలాగ్స్ స్పష్టం చేశాయి. మాటతో కాదు.. ఆటతో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. నాను పెద్ది సారు.. గెలుపైనా, ఓటమైనా కొండ కింద ఊరి వాడిదే వాలి. మీరు అందరూ ఆడానని అనుకొంటున్నారు. కానీ నేను పోరాడాను అంటూ చెప్పించిన డైలాగ్స్ సినిమా ఇంటెన్సిటీని తెలిపింది. రంగస్థలం తర్వాత రాంచరణ్ మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనే పెద్ది ట్రైలర్‌లో శాంపిల్‌లా కొన్ని సీన్లను చూపించారు. ఈ సన్నివేశాలు మెగా ఫ్యాన్స్‌కు కొత్త ఊపిరిని నింపబోతున్నాయనేది గ్యారెంటీగా అనిపిస్తున్నది.
ఇక ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్స్ మాత్రమే కాదు.. రొమాన్స్ కూడా సమపాళ్లలో ఉంటుంది అనే విషయం జాన్వీ కపూర్, రాంచరణ్ మధ్య సన్నివేశాలు మచ్చుగా కనిపించాయి. ఆకాశం నుంచి సుక్కలు రాలిపడుతాయని అంటారు కదా.. ఈ పూట విజయ నగరంలో అలాంటి సుక్క రాలిపడిందా? అనేది క్రేజీగా ఉంది. రాంచరణ్, జాన్వీ మధ్య కెమిస్ట్రీ కొత్తగా ఉండబోతుందని జాన్వీపై చిత్రీకరించిన సన్నివేశాలు చెప్పాయి. అయితే తెలుగు వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉండబోతున్నది. ఇక నార్త్ ఇండియాలో ఈ మూవీ ఎలాంటి వైబ్ క్రియేట్ చేస్తుందనే విషయాన్ని వేచి చూడాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications