పెద్దిలో జాన్వీ ఫస్ట్ ఛాయిస్ కాదా.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరు?

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా పెద్ది (Peddi). ఈ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ రోజురోజుకీ మరింత హాట్ టాపిక్‌గా మారుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)హీరోగా, యంగ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా (Buchi Babu Sana)దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. 'ఉప్పెన' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు తీస్తున్న సినిమా కావడం, మరోవైపు రామ్ చరణ్ పూర్తిగా రూరల్ మాస్ అవతార్‌లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి.

ఇలాంటి సమయంలో దర్శకుడు బుచ్చిబాబు సాన చేసిన ఒక కీలక వ్యాఖ్య ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమాలో హీరోయిన్‌గా కనిపిస్తున్న జాన్వీ కపూర్ (Janhvi Kapoor) మొదటి ఎంపిక కాదని, ఆమె స్థానంలో మొదట ఆమె చెల్లెలు ఖుషి కపూర్ (Khushi Kapoor)ను అనుకున్నట్లు వెల్లడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Peddi Twist Janhvi Kapoor Not First Choice Khushi Kapoor Missed Big Break Role

ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు మాట్లాడుతూ.. మొదట 'అచ్చియమ్మ' పాత్ర కోసం ఖుషీ కపూర్‌ను సంప్రదించాం. ఆమెకు కథ కూడా వినిపించాం. అయితే పర్సనల్‌గా కలిసిన తర్వాత ఆ పాత్రకు ఆమె చాలా చిన్నగా అనిపించింది. ఆ క్యారెక్టర్‌కు కావాల్సిన మేచ్యూరిటీ ఆమెలో కనిపించలేదు' అని తెలిపారు. దీంతో ఆమెను రిజెక్ట్ చేసి, తర్వాత జాన్వీ కపూర్‌ను సంప్రదించాల్సి వచ్చిందని చెప్పారు.

'ఒకే ఇంట్లో చెల్లిని వద్దనుకుని అక్కకు కథ చెప్పడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఖుషీకి ఇది బాధ కలిగించిందా అని కూడా జాన్వీని అడిగాను' అని బుచ్చిబాబు చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే సినిమా కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని, మొదటి నుంచి ఈ పాత్రకు జాన్వీనే సరిపోతుందని తన మనసు చెప్పిందని స్పష్టం చేశారు.

ఇక జాన్వీ కపూర్ పాత్ర గురించి కూడా దర్శకుడు ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. 1980ల పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె 'అచ్చియమ్మ'గా డీగ్లామర్, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇది ఆమె కెరీర్‌లో ఎంతో కీలకమైన సినిమాగా భావిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడానికి ఈ సినిమా పెద్ద అవకాశం కానుంది.

మరోవైపు, ఈ సినిమాలోని కథా నేపథ్యం కూడా ఆసక్తికరంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్, సాంప్రదాయ కుస్తీ (పెహల్వానీ) చుట్టూ కథ నడుస్తుందని సమాచారం. రూరల్ ఎమోషన్స్, స్పోర్ట్స్ డ్రామా, మాస్ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టేలా దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా హీరోయిన్ ఎంపికలో జరిగిన ఈ ట్విస్ట్ 'పెద్ది'పై మరింత ఆసక్తిని పెంచింది.

ఖుషీ కపూర్ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవడం ఒక పెద్ద లాస్‌గా భావిస్తే, జాన్వీ కపూర్‌కు ఇది కెరీర్‌లో ఒక కీలక టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా, విడుదలకు ముందు నుంచే ఇలాంటి ఆసక్తికర విషయాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు ప్రేక్షకులంతా జూన్ 4 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more about: peddi khushi kapoor janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X