50 రూపాయలకే సినిమా టికెట్.. పేకమేడలు నిర్మాత రాకేష్ వర్రే బోల్డ్ నిర్ణయం!

తెలుగు ప్రజలకు వినోదం అంటే సినిమానే. అయితే మూవీ టికెట్ రేట్ల పెంపు వల్ల ఆ ఎంటర్‌టైన్‌మెంట్ దూరం అవుతుందనే విషయం వివాదాస్పదంగా మారింది. అయితే చిన్న సినిమాలకు టికెట్ రేట్ల పెంపు, ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లు ప్రతికూలంగా మారడం కనిపిస్తున్నది. అయితే తమ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులకు అందించాలనే విషయంతో చిన్న సినిమా నిర్మాతలు అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నారు. జూలై 19వ తేదీన రిలీజ్ అవుతున్న పేకమేడలు అత్యంత తక్కువ ధరకే క్వాలిటీ ఉన్న సినిమాను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా పరిశ్రమలో వర్థమాన నటుడిగా ప్రశంసలు అందుకొంటున్న రాకేశ్ వర్రే నటించిన చిత్రం పేక మేడలు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మించారు. వినోద్ కిషన్ అనే నటుడిని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. వినోద్ కిషన్ ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గతంలో నా పేరు శివ, అంధగారం అనే సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు మంచి స్పందన లబిస్తున్నది.

Pekamedalu premier Show Ticket Rate 50 Rupees Producer Rakesh Varre takes bold decision

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ కలబోసిన ఈ సినిమాలో మహిళా చైతన్యం అనే పాయింట్‌తో చిన్న మెసేజ్ ఇవ్వబోతున్నారు. ఇలాంటి ఉన్నత విలువలు ఉన్న సినిమాను ప్రేక్షకుడికి చేరువ చేసేందుకు, మంచి సినిమాను ఎక్కువ మందికి చూపించాలనే ఉద్దేశంతో ఈ మూవీ ప్రీమియర్ షో టికెట్ రేట్‌ను కేవలం 50 రూపాయలకే నిర్ణయించారు.

పేకమేడలు సినిమా ప్రీమియర్లను 18, 19వ తేదీల్లో వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ ప్రీమియర్ షోలు ప్రదర్విస్తున్నారు. ఇప్పటికే వైజాగ్‌లో కొన్ని షోలు ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో యూనిట్ హ్యపీగా మరింత ఉత్సాహంతో ప్రమఓసన్స్ చేస్తున్నది.

Pekamedalu premier Show Ticket Rate 50 Rupees Producer Rakesh Varre takes bold decision

దర్శకుడు నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ.. నిర్మాత రాకేష్ వర్రే అందించిన సహకారం మరువలేనిది. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వస్తున్నది. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మా సినిమా కూడా ఆడియెన్స్ మంచి అనుభూతిని పంచుతుందని భావిస్తున్నాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X