For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఓటీటీలో RRR రిలీజ్ న్యూస్... షాక్ ఇచ్చిన బడా నిర్మాణ సంస్థ

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తంలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఏకైక సినిమా RRR. దర్శకుడు రాజమౌళి బాహుబలి లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ప్రతి ఒక్క అప్డేట్ కూడా సినిమాపై ఎప్పటికప్పుడు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా కనిపిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమా కోసం కేవలం ఆడియెన్స్ మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రెటీలు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు

  ఈ క్రమంలో RRR సినిమా కి సంబంధించిన వార్తలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బిగ్ సినిమాను ఓటీటీలో త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ఒక టాక్ అయితే వైరల్ గా మారింది. అయితే ఇంతవరకు కూడా టాలీవుడ్ చిత్రయూనిట్ సభ్యులు ఎవరు కూడా పెద్దగా ఆ విషయంపై స్పందించలేదు. కానీ ఈ సినిమా హిందీ హక్కులను సొంతం చేసుకున్నటు వంటి పెన్ స్టూడియో మాత్రం మొదటిసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. RRR థియేటర్లలోనే విడుదల కానున్నట్లు వివరణ ఇచ్చారు. అలాగే వారు నిర్మిస్తున్న మరో రెండు సినిమాలపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలియా భట్ - సంజయ్ లీలా బన్సాలి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గంగుభాయ్ ఖతీయవాడి సినిమాతో పాటు ఎటాక్ సినిమా కూడా థియేటర్లోనే విడుదలవుతుందని వివరణ ఇచ్చారు. ఈ పెద్ద సినిమాలను వెండి తెరపై చూస్తే అద్భుతంగా ఉంటుందని ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని కూడా తెలియజేశారు.

  Pen studios clarification on RRR and other two movies ott rumours

  ఇక RRR సినిమా విడుదలపై ప్రస్తుతం చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అసలైతే అక్టోబర్ 13న విడుదల చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల వలన ఈ సినిమా మరోసారి వాయిదా వేయుట తప్పడం లేదని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మహేష్ బాబు సర్కారు వారి పాట ప్రభాస్ రాధేశ్యామ్ కూడా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి.

  అయినప్పటికీ రాజమౌళి సంక్రాంతి సీజన్ ను మాత్రమే క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి సినిమా ఆ సమయంలో ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా అనంతరం దర్శకుడు రాజమౌళి వెంటనే మహేష్ బాబు సినిమాను మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కబోయే ఆ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం మొదలు పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాను కూడా రాజమౌళి పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా తెరకెక్కించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక 2024 చివరలో ఆ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.

  English summary
  Pen studios clarification on RRR and other two movies ott rumours
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X