‘ఖిలాడీ’ నుంచి అదిరిపోయే ప్రకటన: ఆ భాషలో కూడా రవితేజ సినిమా విడుదల
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. చాలా కాలం తర్వాత గత ఏడాది 'క్రాక్' మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు, ఇది అప్పుడు థియేటర్లలో యాభై శాతం ఆక్యూపెన్సీ ఉన్నా.. కలెక్షన్లను మాత్రం భారీ స్థాయిలోనే రాబట్టింది. దీంతో ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా కూడా నిలిచింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడీ మాస్ హీరో.
'క్రాక్' మూవీ ఇచ్చిన ఊపులో ఉన్న మాస్ మహారాజా రవితేజ.. ఆ వెంటనే 'ఖిలాడీ' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. రమేష్ వర్మ రూపొందిస్తోన్న ఈ సినిమా పుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. సెకెండ్ వేవ్ వచ్చిన తర్వాత కొంత భాగం బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే దీన్ని పున: ప్రారంభించి టాకీ పార్ట్ మొత్తాన్ని శరవేగంగా పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఆరంభించి.. వాటిని కూడా దాదాపుగా కంప్లీట్ చేసేసింది చిత్ర యూనిట్.

మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'ఖిలాడీ' మూవీని గత ఏడాది మేలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా షూటింగ్ మొత్తం పూర్తి కాలేదు. దీంతో ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ, అప్పటికి కూడా పనులు కంప్లీట్ కాలేదు. ఇక, అప్పుడు దీన్ని ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక, ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్‌లో యాభై శాతం ఆక్యూపెన్సీతో పాటు నైట్ కర్ఫ్యూ ఉండడంతో ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీ విడుదలపై ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో తాజాగా దీని నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీనే విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, దీన్ని హిందీలోనూ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. అంటే.. ఈ చిత్రం ద్వారా మాస్ మహారాజా రవితేజ బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించబోతున్నాడన్న మాట. ఇక, ఈ సినిమాను పెన్ స్టూడియోస్ సంస్థ హిందీలో రిలీజ్ చేస్తుంది. ఇందుకోసం భారీ మొత్తాన్నే చిత్ర యూనిట్‌కు చెల్లించినట్లు ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది.
'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











