నాగబాబు పరిస్థితి మరీ దారుణంగా ఉందే! ఇక దానికే పరిమితం కావాల్సిందేనా..?

Recommended Video

Mega Brother Nagababu In Dilemma, Will He Join Tv Show Again? || Filmibeat Telugu

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు టీడీపీ వర్గాలపై ఏ మేరకు ప్రభావం చూపిందో తెలియదు కానీ జనసేన వర్గాన్ని మాత్రం కుదిపేసింది. రాష్ట్రంలో ఉన్న అవినీతిని వెలికితీస్తా.. ఛలోరె ఛలోరె ఛల్ అంటూ జనసేన పార్టీతో జనం ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఆయనకు మద్దతుగా మెగా కుటుంబం కూడా కదిలింది. ముఖ్యంగా నాగబాబు వీరోచితంగా ముందుకెళ్లారు. కానీ చివరకు ఏం జరిగింది? అది మీకే తెలుసు. అయితే ఇప్పుడు నాగబాబు పరిస్థితిపై రకరకాల చర్చలు తెరపైకి వచ్చాయి. ఎక్కడ చూసినా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. వివరాల్లోకెళితే..

జనసేన ఎఫెక్ట్..

జనసేన ఎఫెక్ట్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది. 175 స్థానాలకు గాను కేవలం ఒక్క సీటు దక్కించుకొని సర్దుకుపోవడంతో అంతా షాక్ అయ్యారు. కానీసం పవన్ కళ్యాణ్, నాగబాబు విక్టరీ అయినా చూస్తామేమో అనుకున్నా ఆ కల కూడా నెరవేరక పోవడం జనసేన వర్గాలకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబుపై చర్చలు ఊపందుకున్నాయి.

నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా నాగబాబు

నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా నాగబాబు

తమ్ముడు జనసేన పార్టీ పెట్టిన కొత్తలో ఆ పార్టీకి కాస్త దూరంగా ఉన్న నాగబాబు చివరకు అదే పార్టీ నుంచి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తీరా ఫలితాలు చూస్తే.. నాగబాబు మార్క్ కొంచెం కూడా కనిపించలేదు. ఘోర పరాజయం మూటగట్టుకున్నాడు నాగబాబు. దీంతో కంగుతిన్న ప్రేక్షకులు ఇక నాగబాబు నెక్స్ట్ ఏంటి? అనే అంశంపై పడ్డారు.

నా ఛానెల్ నా ఇష్టం అంటూ

నా ఛానెల్ నా ఇష్టం అంటూ

జనసేన బరిలో నిలిచిన నాగబాబు కొద్ది రోజుల పాటు తన జబర్దస్త్ షోకి విరామం ఇచ్చారు. ఆ సమయంలోనే నా ఛానెల్ నా ఇష్టం అనే పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానెల్ పెట్టి ప్రత్యర్థి వర్గాలపై విరుచుకు పడ్డారు. గతంలో జరిగిన ఇష్యులను బయటకు తీస్తూ తనదైన కోణంలో పంచ్ లు విసిరారు నాగబాబు. కానీ తీరా చూస్తే అవేవీ వర్కవుట్ కాలేదు. తమ్ముడు పవన్ సహా అన్నయ్య నాగబాబు ఓకే దారి.. అదేనండీ ఓటమి బాట పట్టారు.

ఇక దానికే పరిమితమా..?

ఇక దానికే పరిమితమా..?

మెగా హీరోల్లో నాగబాబుకు బాగా పేరు తెచ్చిపెట్టింది జబర్దస్త్ షో. నాగబాబు నవ్వులు ఆ షోకి బాగా ప్లస్ అయ్యాయి. ఓ వైపు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే జబర్దస్త్ ద్వారా బాగా ఫేం అయ్యాడీ మెగా బ్రదర్. షో స్టార్ట్ అయిన మొదటి నుంచీ ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సమయంలో బ్రేక్ ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో ఊహించని దెబ్బడింది. దీంతో ఆయన తిరిగి జబర్దస్త్ గూటికే చేరతాడని చెప్పుకుంటున్నారు జనం.

 ఓడినా సేవ చేస్తా..

ఓడినా సేవ చేస్తా..

నర్సాపురం ఎంపీగా బరిలో నిలిచిన నాగబాబు.. ఓ సందర్భంలో మాట్లాడుతూ గెలిచినా, ఓడినా ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని మాటిచ్చారు. ఈ నేపథ్యంలో ఇది కూడా చర్చలోకి వస్తోంది. చూడాలి మరి మెగా బ్రదర్ నాగబాబు జర్నీ ఎటు నుంచి ఎటు మళ్లుతుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X