ప్రభాస్ - మారుతి సినిమా షూర్ షాట్.. అంచనాలు పెంచేసిన ఒకే ఒక్క ట్వీట్
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అలా చాలా కాలం పాటు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. దీంతో క్రమంగా తన రేంజ్‌ను పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.
అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఇలా ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో 'సలార్', ఓం రౌత్‌తో 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్‌తో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్ మూవీని చేస్తున్నాడు.

ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను లైన్‌లో పెట్టుకున్న ప్రభాస్.. ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో 'రాజా డీలక్స్' (పరిశీలనలో ఉన్న పేరు) అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా ఎంతో రహస్యంగా జరుగుతోంది. ఇందుకోసం ఓ బంగ్లా సెట్‌ను నిర్మించి, అందులో చిత్రీకరణ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే దాదాపుగా 40 శాతానికి పైగా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది.
క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆయన దీని నుంచి తప్పుకోవడంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇక, తాజాగా ట్విట్టర్‌లో ఆ సంస్థ నుంచి ఓ ట్వీట్ వచ్చింది.
దానికి ఓ నెటిజన్ 'ప్రభాస్ - మారుతి మూవీ గట్టిగా రావాలమ్మా' అని కామెంట్ చేశాడు. దీనికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హ్యాండిల్ నుంచి 'ష్యూర్ షాట్' అనే రిప్లై వచ్చింది. అంతే.. అప్పటి నుంచి ఈ ట్వీట్ తెగ వైరల్ అవడంతో పాటు ఈ చిత్రంపై ఉన్న అంచనాలన్నీ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇందులో సంజయ్ దత్ దెయ్యం పాత్రను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











