Devara: రిలీజ్‌కు ముందే దేవరకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ మూవీపై హైకోర్టులో పిటీషన్
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన సినిమాలు చేసి అలరించిన అతడు.. ఈ మధ్య కాలంలో భారీ ప్రాజెక్టుల్లో భాగం అవుతున్నాడు. ఇలా ఇప్పుడు తారక్ 'దేవర' అనే సినిమాలో నటించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లోనే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి బిగ్ షాక్ తగిలింది. ఆ వివరాలు మీకోసమే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల రూపొందించిన సినిమానే 'దేవర'. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కించారు. దీనికితోడు ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్లు కూడా ఉండడంతో ఈ చిత్రం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

హై ఓల్టేజ్ యాక్షన్ స్టోరీతో రాబోతున్న 'దేవర' మూవీని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. ఇక, గురువారం సాయంత్రమే విదేశాల్లో భారీ స్థాయిలోనే ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు అమలులో ఉన్న టికెట్ రేట్లకు సింగిల్ స్క్రీన్స్‌లో 100, మల్టీప్లెక్స్‌లో 60 వరకు పెంచుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో చిత్ర యూనిట్, బయ్యర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌లో 'దేవర' సినిమాకు టికెట్ రేట్లను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటీషన్ నమోదు అయింది. టికెట్ రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని పిటీషనర్లు కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలంటూ అందులో డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన 'దేవర' సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకోలు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











