‘పిహు’ ట్రైలర్: ఈ చిన్నారి మీలో టెన్షన్ రేకెత్తించడం ఖాయం!
ఇంట్లో ఎవరూ లేనపుడు, తల్లిదండ్రులు పడుకుని ఉన్నపుడు లేదా అపస్మారక స్థితిలో ఉన్నపుడు చిన్నారుల ప్రవర్తన ఎలా ఉండే అవకాశం ఉంది? అనే అంశాలను ఫోకస్ చేస్తూ 'పిహు' పరుతో ఓ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 125 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ టెన్షన్ రేకెత్తించేలా ఉంది.
'ప్రతీ తల్లిదండ్రులకు వచ్చే పీడకల ఇది..' మొదలైన ఈ ట్రైలర్‌లో పిహు అనే రెండేళ్ల చిన్నారిని చేసే పనులు మిమ్మల్ని భయబ్రాంతులకు, టెన్షన్‌కు లోను చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆటట్లో మునిగిపోయి పిల్లలకు తమకు తెలియకుండా ఎలా ప్రమాదాల బారిన పడతారు అనేది ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.
ఇక ట్రైలర్ చివర్లో తన చేతిలోని బొమ్మ పై అంతస్తు నుంచి కిందపడిపోతే దాని కోసం పిహు కూడా పైనుంచి దూకడానికి ప్రయత్నిస్తున్న సన్నివేశాలు చూసే వారిని మరింత ఆందోళనకు గురి చేసే విధంగా ఉన్నాయి.

వినోద్ కాప్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సిద్ధార్థ్ రాయ్ కపూర్, శిల్పా జిందాల్, రోన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications