twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నానికి కృతజ్ఞత లేదు.. గిఫ్ట్ ఇస్తే మాట కూడా చెప్పకుండా..: నిజాన్ని బయటపెట్టిన పిల్ల జమిందార్ నిర్మాత

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు చిన్న సినిమాలతోనే బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటూ ఉంటారు. అయితే అందులో మరికొందరు ఉన్నత స్థాయికి చేరుకోరు. వాళ్ళు ఒకే స్థాయులో ఉంటారు. అలాంటి బెస్ట్ నిర్మాతల్లో దిఎస్.రావ్ ఒకరు. ఆయన తీసిన పిల్ల జమిందార్ సినిమా అప్పట్లో భారీ స్థాయిలో లాభాలను అందించింది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎస్.రావ్, హీరో నానిపై కొన్ని భిన్నమైన కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

    స్విమ్ సూట్‌లో క్లీవేజ్ షోతో‌ సెగలు రేపుతోన్న పార్వతి నాయర్

     ఎక్కువగా యువ హీరోలతో

    ఎక్కువగా యువ హీరోలతో

    నిజానికి కొత్తగా వచ్చే హీరో హీరోయిన్స్ దర్శక నిర్మాతల సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక హీరోపై భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడం అంటే ఎంతైనా రిస్క్ తో కూడుకున్న పని. ఇక పదేళ్ల క్రితం ఎక్కువగా ఆ తరహాలోనే యువ హీరోలతో డీఎస్.రావ్ సినిమాలు చేశారు.

     పిల్ల జమిందార్ బాక్సాఫీస్ హిట్

    పిల్ల జమిందార్ బాక్సాఫీస్ హిట్

    ఇక 2011లో వచ్చిన పిల్ల జమిందార్ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా అనేక మంది ప్రొడ్యూసర్స్ దగ్గరకు వెళ్లి చివరికి డీఎస్.రావ్ దగ్గరకు వెళ్లింది. సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే కూడా కొంత ఎక్కువే అయ్యిందట. మొత్తానికి సినిమా విడుదల తరువాత కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అందించింది.

     కనీసం కృతజ్ఞత కూడా ఉండదు

    కనీసం కృతజ్ఞత కూడా ఉండదు

    అయితే ఆ సినిమా షూటింగ్స్ అయిపోయిన అనంతరం చాలా మంది యువ హీరోలకు హీరోయిన్స్ గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్లు డీఎస్.రావ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంత చేసినా కూడా ఆ తరువాత ఏమి లాభం ఉండదని కనీసం కృతజ్ఞత కూడా చూపించారనే విధంగా డీఎస్.రావ్ వివరణ ఇచ్చారు.

    నానికి గిఫ్ట్ కింద ఓవర్సీస్ రైట్స్

    నానికి గిఫ్ట్ కింద ఓవర్సీస్ రైట్స్

    ఇక నానికి కూడా ఒక గిఫ్ట్ కింద ఓవర్సీస్ రైట్స్ ఇచ్చినట్లు చెప్పారు. పిల్ల జమిందార్ సినిమా పూర్తయిన తరువాత అతనికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ తో పాటు ఓవర్సీస్ రైట్స్ కావాలి అంటే రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చేశానని అన్నారు. అయితే ఆ తరువాత కనీసం కొంత డబ్బు వచ్చిందని కూడా నాని తనతో కనీసం చెప్పకపోవడం ఆశ్చర్యం అని అన్నారు.

    Recommended Video

    #AyPilla : Aypilla Song Genuine Review | Naga Chaitanya | Sai Pallavi | Sekhar Kammula
     నేను చేసిన తప్పు అదే..

    నేను చేసిన తప్పు అదే..

    దాదాపు సినిమా ఇండస్ట్రీలో అందరూ హీరో హీరోయిన్స్ ఇలానే ఉంటారని లేకపోతే ప్రొడ్యూసర్స్ కూడా హీరోల లెవెల్లో హై రేంజ్ లో ఉంటారని అన్నారు. ఇక అప్పట్లో చిన్న హీరోలతో సినిమాలు చేయడమే నేను చేసిన తప్పు. నాకు బ్యాక్ గ్రౌండ్ లో మంచి సపోర్ట్ ఉన్నప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేసి ఉంటే బావుండేది.. అని డీఎస్.రావ్ తెలిపారు.

    English summary
    Some producers in the Tollywood industry are getting box office hits with short films. But for the most part they are on the same level. DS Rao is one of the best producers. His film Pilla Zamindar was a huge success at the time. However in a recent interview DS Rao, making some different comments on Hero Nani went viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X