అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో పవన్ ఎంట్రీ.. షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘట్టం త్వరలోనే నిజం కాబోతోంది. రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ వెండితెరకు దూరం కావడంతో బాక్సాఫీస్ కళ తప్పింది. మళ్లీ పవర్ స్టార్ ఎంట్రీ ఇవ్వాలని కోట్ల మంది అభిమానులు ఆశపడ్డారు. అయితే వీటిపై గత కొంత కాలం నుంచి వార్తలు రాగా.. నేడు అవి నిజం కాబోతోన్నాయి. గత కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తోన్న పింక్ రీమేక్ చిత్రం గురించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది.

త్రివిక్రమ్ ప్రోద్భలంతోనే..

త్రివిక్రమ్ ప్రోద్భలంతోనే..

బాలీవుడ్‌లో అమితాబ్ నటించిన పింక్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇదే సినిమాను తమిళ్‌లోనూ రీమేక్ చేయగా..అక్కడా సక్సెస్ అయింది. అయితే ఈ చిత్రాన్ని ఇటు పవన్‌కు, అటు నిర్మాతలకు చూడండనే సలహాను, తానే ఇచ్చినట్టు స్వయంగా త్రివిక్రమ్ వెల్లడించాడు. పింక్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటించడం వెనక త్రివిక్రమ్ ప్రోద్భలం ఉన్నట్టే లెక్క.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు..

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు..

ఈ చిత్రానికి సంబంధించిన పనులను గత నెలలోనే ప్రారంభించాడు నిర్మాత దిల్ రాజు. వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి తన నుంచి బెస్ట్ ఇస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.

రెగ్యులర్ షూటింగ్..

రెగ్యులర్ షూటింగ్..


పింక్ రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ అతి తక్కువ డేట్స్‌ను మాత్రమే కేటాయిస్తారని, సినిమా షూటింగ్‌ను కూడా త్వరగా పూర్తి చేస్తారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ మూవీకి పవన్ భారీగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్ వచ్చేసింది.

Recommended Video

Pawan Kalyan's Remuneration For Pink Remake
జనవరి 20 నుంచి..

జనవరి 20 నుంచి..


పింక్ రీమేక్‌కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది. అంతేకాకుండా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్‌ను పవన్ ప్రారంభించబోతున్నాడు. ఇక పవర్ స్టార్ అభిమానులకు పండుగ ఇప్పుడే మొదలైనట్టు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X