అప్పుడు పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ… ఇప్పుడు విజయ్ దళపతి .. పైరసీ వేటుకు బలి!

అభిమాన హీరో సినిమా విడుదల అంటే అభిమానులు పండుగలాగా భావిస్తారు. దర్శక, నిర్మాతలు కూడా కోట్లాది ఆశలతో ఎదురుస్తుంటారు. కానీ, ఆ ఆనందాన్ని దోచేస్తుంది పైరసీ. సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టి పీడిస్తోంది. కొన్ని సార్లు థియేటర్లలో రిలీజ్ అయిన కొద్దిగంటల్లోనే సినిమా అక్రమంగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతుంటే.. మరికొన్ని సినిమాలు విడుదల కాకముందే.. కొందరూ లీక్ వీరులు సినిమాను లీక్ చేస్తోన్నారు. వేల గంటల శ్రమ, కోట్ల రూపాయల పెట్టుబడితో రూపొందిన సినిమా.. ఒక్క క్లిక్‌తో లీక్ అవ్వడంతో నటులు, దర్శక, నిర్మాతల కష్టాన్ని ప్రతిఫలం దక్కకుండా పోతుంది. తీరని నష్టాన్ని మిగులుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ సినిమాలు, ఇప్పుడు విజయ్ దళపతి సినిమా పైరసీ వేటుకు బలైంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా తెరకెక్కిన సినిమా అత్తారింటికి దారేది(Attarintiki Daredi). 2013 లో ఈ సినిమా విడుదలకు ముందే లీక్ కావడం ఇండస్ట్రీని కుదిపేసింది. ఈ సినిమా విషయంలో అంతర్గతంగా మూవీ డేటా బయటకు వెళ్లి, డీవీడీలు, పెన్‌డ్రైవ్‌లు, మొబైల్ మెమరీ కార్డుల ద్వారా సినిమా మొత్తం ప్రజల్లోకి వెళ్లింది. ఈ కేసు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపినా... నిర్మాతలకు జరిగిన నష్టం మాత్రం తిరిగి రాలేదు. కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ పైరసీకి వ్యతిరేకం నిలిచారు. అత్తారింటికి దారేటి సినిమా పూర్తిగా లీక్ అయినా .. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 120 కోట్లకు పైగా (వరల్డ్ వైడ్ గ్రాస్) వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది.

Piracy Strikes Again Then Pawan Kalyan Vijay Deverakonda Now Thalapathy Vijay s Film Leaked

ఆ తర్వాత కాలంలో కూడా పైరసీ ఆగలేదు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)నటించిన టాక్సీ వాలా(Taxiwaala) సినిమా కూడా విడుదలకు ముందే పూర్తిగా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఈ ఘటనపై విజయ్ దేవరకొండ స్వయంగా స్పందిస్తూ... "సినిమా మీద నమ్మకం ఉంది కానీ, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన టెక్నీషియన్ల భవిష్యత్తుపై భయం వేసింది" అని చెప్పడం అప్పట్లో వైరల్ అయింది. అయినప్పటికీ కంటెంట్ బలం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 40 కోట్ల గ్రాస్,రూ.22.31 కోట్ల షేర్ (Share) వసూలు చేసింది.

ఇక ఇప్పుడు కోలీవుడ్‌లో మళ్లీ రిపీట్ అయింది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ( Vijay) నటించిన తాజా సినిమా జననాయగన్ (Jananayagan) కూడా పైరసీ బారిన పడింది. ఈ సినిమా విడుదలకు ముందే ఐదు నిమిషాల కీలక క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ కావడం కలకలం రేపింది. ముఖ్యంగా ఈ సినిమా రాజకీయాలపై సెటైరికల్‌గా ఉండటంతో... ఈ లీక్ వెనుక కుట్ర ఉందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే... లీక్ అయిన వీడియోలో ఎడిటింగ్ సమయంలో పాజ్ చేసిన ఫ్రేమ్ కూడా కనిపించడంతో, ఇది ఇంటర్నల్ లీక్ అయ్యి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో నిర్మాణ సంస్థ అప్రమత్తమై సోషల్ మీడియాలో లీక్ కంటెంట్‌ను రిపోర్ట్ చేయాలని అభిమానులను కోరింది. మరోవైపు, దళపతి విజయ్ అభిమానులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పైరసీ ప్రభావం కేవలం ఒక సినిమాకే పరిమితం కాదు. ఇది మొత్తం ఇండస్ట్రీని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఓటీటీలు వచ్చిన తర్వాత పైరసీ తగ్గుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు థియేటర్ ప్రింట్స్, ఇంటర్నల్ లీక్‌లు, టెలిగ్రామ్ ఛానెల్స్ రూపంలో ఇది మళ్లీ పెరుగుతోంది.

మొత్తంగా చూస్తే... అప్పుడు పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ.. ఇప్పుడు దళపతి విజయ్. హీరోలు మారినా... కాలం మారినా... పైరసీ మాత్రం మారడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుల పాత్ర చాలా కీలకం. సినిమాలను థియేటర్లలో లేదా అధికారిక ప్లాట్‌ఫార్మ్‌లలో మాత్రమే చూడడం ద్వారా..ఈ చీడపురుగైన పైరసీకి చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. లేదంటే... ఎంత పెద్ద సినిమా అయినా నష్టాల బాట పట్టే ప్రమాదం తప్పదనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. జననాయగన్ సినిమా విడుదల ప్రశ్నార్థకంగా మరిపోయింది. గతంలో రాజకీయపరంగా అభ్యంతరం సన్నీవేశాలు ఉన్నాయనీ విడుదలను నిలిపివేశారు. సెన్సార్ బోర్డు కూడా పలుమార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. తాజాగా విడుదలకు ముందే లీక్ కావడం చూస్తే.. ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందా? లేదా ఓటీటీలో విడుదల చేయబోతున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి రాబోయే రోజుల్లో మూవీ మేకర్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X