‘దేవుడు లాంటి పవన్‌కు ఓటు వేసే భాగ్యం.. తిరుపతి హుండీలో కాసుల లెక్కపెట్టినట్టే ఓట్ల లెక్కింపు’
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ఓటింగ్ హడావిడి ముగిసింది. కానీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై అన్ని చోట్ల చర్చ జరుగుతుంది. అయితే పిఠాపురంలో మాత్రం భిన్నమైన టాక్ సడుస్తున్నది. పవన్ కల్యాణ్ పోటీ చేసిన ఈ స్థానంలో మెజారిటీ ఎంత అనే విషయమే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో పిఠాపురం ఓటర్లు మీడియాతో మాట్లాడుతూ.
పిఠాపురానికి సంబంధించిన వ్యక్తులు గత ఎన్నికల్లో వచ్చి ఓటు వేసే వారు కాదు. కానీ ప్రస్తుతం ఎన్నికల్లో పక్క రాష్ట్రం, బయటి రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చి ఓటే వేశారు. అందుకు కారణం ఇక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. అందువల్లే సుమారు 90 శాతం ఓటింగ్ జరిగింది అని పిఠాపురం గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

పవన్ కల్యాణ్‌కు ఓటు వేయడమంటే.. దేవుడికి ఓటు వేయడమే. మాకు ఆ అదృష్టం మాకు దక్కింది. ఈ దేవుడికి ఓటు వేసుకోనే అదృష్టాన్ని ఆ దేవుడు కలిగించాడు. మొత్తానికి ఓ మంచి వ్యక్తికి ఓటు వేసుకోనే అవకాశం దక్కింది. పవన్ కల్యాణ్‌ను గెలిపించుకోవడం బాధ్యతగా స్వీకరించారు. కాబట్టి ప్రస్తుతం వన్ సైడ్ ఓటింగ్ జరిగింది అని అభిమానుల పేర్కొన్నారు.
ఇక పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోలైన ఓట్ల శాతంలో దాదాపు 90 శాతం ఓట్లు పవన్ కల్యాణ్‌కు వస్తాయి. తిరుపతి హుండీలో కాసులు లెక్క పెట్టుకొన్నట్టు.. బ్యాలెట్ బాక్సుల నుంచి ఓట్లు లెక్కించుకోవాల్సిందే అని పవన్ కల్యాణ్ అభిమానులు తమ ఆనందాన్ని పంచుకొంటున్నారు.
ఇదిలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం.. పిఠాపురంలో భారీగా ఓటింగ్ జరిగింది. 2019 సంవత్సరంలో 81 శాతం ఓటింగ్ జరుగగా, 2024 సంవత్సరంలో 87 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. ఈ సారి పోలైన ఓట్లలో 90 శాతం పవన్ కల్యాణ్‌కే ఓటు వేశారు అనే మాట వినిపిస్తుంది. కాబట్టి ఆయనకు మెజారిటీ 60 వేలకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











