PKSDT: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మెగా మల్టీస్టారర్ టైటిల్, ఫస్ట్ లుక్ రెడీ.. వచ్చేది ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ జంటగా నటిస్తున్న పీకేఎస్డీటీ గురించి అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రం తమిళ సినిమా వినోదయ సీతమ్ కు రీమేక్. అయితే పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో పవన్ కనిపించ బోతుండగా.. ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా ఈ సినిమాలో దర్శనం ఇవ్వబోతున్నాడు.

ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. అలాగే ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్ సరసన రొమాంటిక్ కథానాయిక కేతికా శర్మ నటించబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.

PKSDT project Title and poster to be Unveiled on a Special Date

అదేంటంటే.. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను రేపు సాయంత్రం (మే 18వ తేదీ) 4.14 నిమిషాలకు రివీల్ చేయబోతున్నట్లు ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అప్పటి వరకూ వేచి చూడండంటూ రాసుకొచ్చారు. అయితే ఈ చిత్రానికి 'బ్రో' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ అంతా ఇదే టైటిల్ ఉండే అకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు.

PKSDT project Title and poster to be Unveiled on a Special Date

రేపు సాయంత్ర వరకు ఆగితే ఈ సినిమా పేరేంటో తెలిసిపోతుంది. అలాగే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నారో కూడా అర్థం అయిపోతుంది. కేవలం 20 నుంచి 25 రోజుల్లోనే పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. అయితే ఆయన ఈ సినిమా కోసం దాదాపుగా 50 కోట్ల వరక పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా రోజుకు రెండు కోట్లు తీసుకున్నారట. జూలై 28వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు కనిపపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X