#PKSDT థియేటర్లలో పవన్ కల్యాణ్ సునామీ.. వినోద సీతమ్ రీమేక్ రిలీజ్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో జీ స్టూడియో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిమ్మకాయల ప్రసాద్, విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న #PKSDT చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. తమిళంలో విజయవంతమైన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను పీపుల్స్ మీడియా, జీ స్టూడియో అధికారికంగా ప్రకటించింది. ఆ రిలీజ్ డేట్, సినిమా వివరాల్లోకి వెళితే..

పవన్, సాయిధరమ్ తేజ్ సోషియో ఫాంటసీ

పవన్, సాయిధరమ్ తేజ్ సోషియో ఫాంటసీ

దక్షిణాది నటుడు, దర్శకుడు సముద్రఖని డైరెక్షన్‌లో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం వినోదయ సీతమ్ తమిళంలో భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమాను సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో సముద్రఖని స్వయంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిరాడంబరంగా నిర్వహించారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారం

త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారం

వినోదయ సీతమ్ సినిమా రీమేక్‌కు సంబంధించి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటల సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాను జూలై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ముహుర్తం నిర్ణయించారు. ఈ మేరకు పీపుల్స్ మీడియా, జూ స్టూడియోస్ సంయుక్తంగా అధికారిక ప్రకటన చేశారు.

జూలై 28వ తేదీన రిలీజ్

జూలై 28వ తేదీన రిలీజ్

#PKSDT మూవీ చిత్రం జూలై 28వ తేదీన థియేటర్లలో సునామీ సృష్టించడానికి రెడీ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ మిమ్మల్ని ఉత్సాహపరచడానికి రెడీ అయ్యాయి అని ఓ ప్రకటనలో నిర్మాతలు తెలిపారు.

వినోదయ సీతమ్ రీమేక్‌లో ఎవరెవరంటే?

వినోదయ సీతమ్ రీమేక్‌లో ఎవరెవరంటే?

వినోదయ సీతమ్ రీమేక్‌లో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాశ్ వారియర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక వర్గానికి సంబంధించిన విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X