గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
వన్ నేనొక్కడినే లాంటి అద్భుతమైన కథ ను ప్రేక్షకులకు అందించిన రచయిత హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో రాబోతున్న సినిమా ప్లే బ్యాక్. ఒకే సారి రెండు వేర్వేరు సమయాల్లో జరిగిన కథను చూపించేందుకు హరి ప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రాస్ టైం కనెక్షన్ మీద ఇప్పటివరకు ఏ చిత్రం రాలేదు. ఒకరికి గతం.. మరొకరికి భవిష్యత్తు అనే కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా బయటకు వచ్చింది.
ఇందులో అనన్య నాగళ్ల గతంలో ఉండగా.. దినేష్ తేజ్ భవిష్యత్తులో ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య లింక్ ఓ కనెక్షన్ లేని ల్యాండ్ లైన్ ఫోన్. ట్రైలర్‌లోనే సినిమా ఎలా ఉండబోతోందో ఓ క్లారిటీ ఇచ్చారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగనున్నట్టు కనిపిస్తోంది. అయితే గతంలో ఏం జరిగింది.. చనిపోయి 25 ఏళ్లు అవుతున్నా కూడా మళ్లీ ఎలా కలిశారు.. అసలు దీని వెనుకున్న లాజిక్స్ ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గతం గురించి ఆలోచించకు అదే మంచిది అంటూ చివర్లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.

శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై తెరక్కేకిన ఈ చిత్రం లో హుషారు సినిమా ఫేమ్ దినేష్ తేజ్ , మల్లేశం సినిమా ఫేమ్ అనన్య నాగళ్ల హీరో హీరోయిన్ లుగా నటించారు . అర్జున్ కళ్యాణ్ , స్పందన , మూర్తి , టీఎన్ ఆర్ , చక్రపాని , అశోక్ వర్ధన్, కార్తికేయ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 5న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. శ్రీ విష్ణు విడుదల చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











