టీఎన్ఆర్ నటించిన ‘ప్లే బ్యాక్' ఆహాలో.. ఆరోజునే రిలీజ్
చిన్న సినిమాలయినా సరే డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలాంటి సినిమానే ప్లే బ్యాక్, హుషారు సినిమాలో నటించిన దినేష్ హీరోగా, వకీల్ సాబ్ సినిమాలో నటించిన అనన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఆడియన్స్ ముందుకు రావాల్సింది. కానీ కరోనా సహా అనేక అవరోధాలను దాటుకుని మార్చ్ ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దినేష్ తేజ్, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ డ్రామా ప్లే బ్యాక్ లో అర్జున్ కళ్యాణ్, స్పందన, కార్తికేయ కృష్ణ మల్లాది, అశోక్ వర్ధన్, టిఎన్ఆర్, మూర్తి, ఆనంద చక్రపాణి, ఐశ్వర్య లక్ష్మి, తాగుబోతు రమేష్, గౌతమ్ రాజు, దీప్తి, జెన్ విష్ణు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో ప్రసాద్ రావు పెద్దినేని ఈ సినిమాని నిర్మించారు.

ఈ సినిమాకి కమ్రాన్ సంగీతం అందించారు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథాంశం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా మే 21 నుంచి మొట్ట మొదటి తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక దివంగత జరల్నిస్ట్, నటుడు టిఎన్‌ఆర్‌లోని నటనలో సరికొత్త కోణాన్ని చూపిన సినిమా ఇది. ఆయన పోషించిన పాత్రల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అని చెప్పవచ్చని అంటున్నారు. 2019లో ఉన్న క్రైమ్ రిపోర్టర్ కి,1993లో ఉన్న సుజాత అనే అమ్మాయికి మధ్య జరిగే టెలిఫోన్ సంభాషణ చుట్టూ ఈ థ్రిల్లర్ మూవీ నడుస్తుంది. అసలు రెండు వేర్వేలు కాలాలకు చెందిన ఇద్దరు ఎలా మాట్లాడుకున్నారు ? అనే అంశం మీద ఈ సినిమా రూపొందించారు.


Click it and Unblock the Notifications











