Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ప్లే బ్యాక్’ అప్డేట్.. వచ్చేది ఎప్పుడంటే?
విషయం ఉంటే అది చిన్న సినిమానా?పెద్ద సినిమానా? అని ప్రేక్షకులు ఆలోచించరు. వారి చిత్రం నచ్చిందా? లేదా? అన్నదే చూస్తారు. అలా వారికి నచ్చాలంటే కథలో కొత్తదనం ఉండాలి. అలాంటి కొత్తదనంతో రాబోతోన్న చిత్రం ప్లే బ్యాక్. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌తో బాగానే హైప్ క్రియేట్ అయింది. వన్ నేనొక్కడినే లాంటి అద్భుతమైన కథ ను ప్రేక్షకులకు అందించిన రచయిత హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో రాబోతున్న సినిమా ప్లే బ్యాక్.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథా, కథనం తో వస్తున్న ప్లేబాక్ అన్నీ కార్యక్రమాలను ముగించుకుని మార్చ్ 5 వ తేదీన థియేటర్ల లో విడుదలకు సిద్ధమవుతోంది . అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది సరికొత్త కథ అని చెబుతోంది టీం , క్రాస్ టైం కనెక్షన్ మీద ఇప్పటివరకు ఏ చిత్రం రాలేదని , కచ్చితంగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు నూతన కథా వస్తువు పరిచయం అవుతుందని అంటుంది ప్లేబాక్ టీం.
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై తెరక్కేకిన ఈ చిత్రం లో హుషారు సినిమా ఫేమ్ దినేష్ తేజ్ , మల్లేశం సినిమా ఫేమ్ అనన్య నాగళ్ల హీరో హీరోయిన్ లుగా నటించారు . అర్జున్ కళ్యాణ్ , స్పందన , మూర్తి , టీఎన్ ఆర్ , చక్రపాని , అశోక్ వర్ధన్, కార్తికేయ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హరి ప్రసాద్ జక్కా ఇంతకుముందు వన్ నేనొక్కడినే కి కథను ఇవ్వడం తో పాటుగా , 100% లవ్ చిత్రానికి స్క్రీన్‌ప్లే ని అందించారు , అలాగే సుకుమార్ రైటింగ్స్ లో దర్శకుడు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు . ఈ చిత్రాన్ని మార్చి 5న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు.