twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ప్లే బ్యాక్’ అప్డేట్.. వచ్చేది ఎప్పుడంటే?

    |

    విషయం ఉంటే అది చిన్న సినిమానా?పెద్ద సినిమానా? అని ప్రేక్షకులు ఆలోచించరు. వారి చిత్రం నచ్చిందా? లేదా? అన్నదే చూస్తారు. అలా వారికి నచ్చాలంటే కథలో కొత్తదనం ఉండాలి. అలాంటి కొత్తదనంతో రాబోతోన్న చిత్రం ప్లే బ్యాక్. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌తో బాగానే హైప్ క్రియేట్ అయింది. వన్ నేనొక్కడినే లాంటి అద్భుతమైన కథ ను ప్రేక్షకులకు అందించిన రచయిత హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో రాబోతున్న సినిమా ప్లే బ్యాక్.

    సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథా, కథనం తో వస్తున్న ప్లేబాక్ అన్నీ కార్యక్రమాలను ముగించుకుని మార్చ్ 5 వ తేదీన థియేటర్ల లో విడుదలకు సిద్ధమవుతోంది . అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది సరికొత్త కథ అని చెబుతోంది టీం , క్రాస్ టైం కనెక్షన్ మీద ఇప్పటివరకు ఏ చిత్రం రాలేదని , కచ్చితంగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు నూతన కథా వస్తువు పరిచయం అవుతుందని అంటుంది ప్లేబాక్ టీం.

    Playback Releasing on 5th March

    శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై తెరక్కేకిన ఈ చిత్రం లో హుషారు సినిమా ఫేమ్ దినేష్ తేజ్ , మల్లేశం సినిమా ఫేమ్ అనన్య నాగళ్ల హీరో హీరోయిన్ లుగా నటించారు . అర్జున్ కళ్యాణ్ , స్పందన , మూర్తి , టీఎన్ ఆర్ , చక్రపాని , అశోక్ వర్ధన్, కార్తికేయ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హరి ప్రసాద్ జక్కా ఇంతకుముందు వన్ నేనొక్కడినే కి కథను ఇవ్వడం తో పాటుగా , 100% లవ్ చిత్రానికి స్క్రీన్ప్లే ని అందించారు , అలాగే సుకుమార్ రైటింగ్స్ లో దర్శకుడు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు . ఈ చిత్రాన్ని మార్చి 5న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు.

    English summary
    Playback Releasing on 5th March,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X