యూట్యూబ్‌‌లో పీఎం నరేంద్రమోదీ కనుమరుగు.. అనేక సందేహాలతో గందరగోళం

ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోదీ చిత్రం అనేక వివాదాల్లో చిక్కుకోవడంతో విడుదల వాయిదా పడింది. ఈ చిత్రంలో ప్రధాని మోదీగా వివేక్ ఒబేరాయ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల ఆగిన నేపథ్యంలో మరో విషయం సెన్సేషనల్‌గా మారింది. ఈ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్ నుంచి తొలగించడం మీడియాలో చర్చనీయాంశమైంది.

pm modi biopic trailer అని గూగుల్ గానీ, యూట్యూబ్‌లో టైప్ చేస్తే సినిమా ట్రైలర్ ఆచూకీ దొరకడం లేదు. ఈ వీడియో అందుబాటులో లేదు అనే సందేశం కనిపిస్తున్నది.

PM Narendra Modi biopic trailer disappear in youtube

అయితే పీఎం నరేంద్రమోదీ వీడియోను ఎవరు తొలగించారు? ఎన్నికల కమిషన్ తొలగించిందా అనే ప్రశ్నలు లేస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా రిలీజ్‌పై ఆంక్షలు విధిస్తూ సినిమాకు సంబంధించిన కంటెంట్, సన్నివేశాలు ఎక్కడా కనిపించకూడదు అని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఆ కారణంగానే యూట్యూబ్‌ నుంచి తొలగించారా? అనే ప్రశ్న వినిపిస్తున్నది.

మార్చి 21న వివేక్ ఒబేరాయ్ నటించిన పీఎం నరేంద్రమోదీ బయోపిక్ ట్రైలర్ రిలీజైంది. మోదీ పాత్రలో ఒబేరాయ్ భారత్ మాతాకు జై అనే నినాదం వినిపించింది. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 15 విడుదల కావాల్సింది. ఎన్నికల కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X