కాజల్ అగర్వాల్‌కు ప్రధాని ఆహ్వానం.. ఎందుకో తెలుసా?
దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఘనవిజయంతో కాషాయ జెండా రెపరెపలాడటంతో ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి ఢిల్లీలో ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగానే కాకుండా, అంతర్జాతీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దేశంలోనే సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ప్రధాని ప్రమాణ స్వీకారానికి యువ అందాల తార కాజల్ అగర్వాల్‌కు కూడా ఆహ్వానం అందింది. గురువారం సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలంటూ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కాజల్ అగర్వాల్‌కు అందిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నది. ప్రధాని మోదీ విజయం సాధించాలని కాజల్ తన వంతు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కాజల్ ఈ కార్యక్రమానికి వెళ్లారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.
కాజల్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా తేజ దర్శకత్వంలో రూపొందిన సీత చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కాగా, క్వీన్ తమిళ రీమేక్‌లోనూ, అలాగే ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











