Jani Master Case: జానీ మాస్టర్ అరెస్ట్‌కు రంగం సిద్దం.. లడఖ్‌కు తెలంగాణ పోలీసులు!

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ ప్రస్తుతం వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అలాగే అత్యాచారం కూడా చేశాడంటూ ఓ ఆయన దగ్గర పనిచేస్తున్న ఓ లేడీ కొరియోగ్రాఫర్ మూడు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ సహా పలువురు, సినీ ప్రముఖులు స్పందించారు. ఇదెలా ఉంటే.. ఈ కేసులో మరో కీలక పరిణామం చేసుకుంది. పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను అరెస్టు చేయడానికి సిద్దమవుతున్నారు. ఇంతకీ జానీ మాస్టర్ ఎక్కడున్నారంటే..

జానీ మాస్టర్ తన టీంలో ఉన్న లేడీ డాన్సర్ పై అత్యాచారానికి పాల్పడ్డరనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 2017లో'ఢీ'షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడనీ, తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి జానీ మాస్టర్ తనని హైదరాబాద్‌కు పిలిపించారని బాధితురాలు పేర్కొంది. అనంతరం అవుట్ డోర్ షూటింగ్ పేరిట చెన్నై,ముంబై,హైదరాబాద్‌తో సహా వివిధ నగరాలకు తిప్పుతూ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసింది.

POCSO case registered against Tollywood choreographer Johnny Master for rape and sexual harassment

అలాగే.. షూటింగ్ సెట్స్ లో క్యారవాన్ లో లైంగిక వేధింపులకు గురి చేశాడని, ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో వివరించింది. అంతేకాకుండా.. మత మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేశానని భయాభంత్రులకు గురి చేశాడని ఆరోపించింది. జానీ మాస్టర్ భార్య కూడా తనకు సహకరించేదనీ, ఆమె కూడా తనపై దాడి చేసిందని ఎఫ్ఆర్ఐలో వెల్లడించింది.

భాదితురాలి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ కేసును నార్సింగి పీఎస్ కు బదిలీ చేశారు.
నేడు ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు అనంతరం పోక్సో కేసు నమోదు చేశారు.

POCSO case registered against Tollywood choreographer Johnny Master for rape and sexual harassment

అలాగే బాధితురాలు నుంచి సఖి, భరోసా బృందాలు కూడా పలు వివరాలు సేకరించాయి. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్‌ పరారీలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జానీ మాస్టర్‌ ప్రస్తుతం లడఖ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయను అదుపులోకి తీసుకోవడానికి రంగంలోకి దిగారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ నుంచి లడఖ్‌ బయలుదేరబోతున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: jani master case tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X