టెంపర్ నటుడిపై కేసు.. రియాలిటీ షోలో అమ్మాయిలతో అలాంటి పనులు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలను నటించిన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ పై తాజాగా పోలీస్ కేసు నమోదు అయింది. బాలీవుడ్లో రీసెంట్గా వచ్చిన రియాల్టీ గేమ్ షోలో మహిళలను అసభ్యకరంగా చూపించారని నేషనల్ విమన్ కమిషన్ ఫిర్యాదు చేసింది. దీంతో అజాజ్ ఖాన్ తో పాటు మరొక బాలీవుడ్ ప్రొడ్యూసర్ పై కేసు నమోదు అయింది. శుక్రవారం వారిని ముంబాయి పోలీసులు హౌస్ అరెస్టు చేయడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు వారు ఏం చేశారనే వివరాల్లోకి వెళితే..

హౌస్ అరెస్ట్ రియాలిటీ షోలో అలాంటి పనులు
హిందీలో రూపొందించిన రియాల్టీ గేమ్ షో హౌస్ అరెస్ట్ ద్వారా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశారు అజాజ్ ఖాన్. ఈ రియాల్టీ షోకు బాలీవుడ్ ప్రొడ్యూసర్ విభూ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ షో ఇటీవల నే ఉల్లు యాప్ లో స్ట్రీమింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు రెండు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అంతలోనే ఈ షోపై వివాదం మొదలైంది. అందుకు కారణం ఆ రియాలిటీ గేమ్ షోలో అమ్మాయిలకు అసభ్యకరంగా టాస్కులు ఇవ్వడమే కారణం. లేడీ కంటెస్టెంట్లకు ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా శృంగార భంగిమలు ప్రదర్శించాలని ఆదేశించడంతో ఈ షోపై వివాదం మొదలైంది.
రీసెంట్ ఎపిసోడ్ లోని అసభ్యకరమైన టాస్కులు..
ఉల్లు యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రియాల్టీ షో వివాదానికి దారి తీసింది. ఈ షోకు నటుడు అజాజ్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే రీసెంట్ ఎపిసోడ్లో లేడీ కంటెస్టెంట్లకు ఇబ్బందికరమైన టాస్కులను ఇచ్చారు. ఒక మేల్ కంటెస్టెంట్, మరొక లేడీ కంటెస్టెంట్ తో శృంగార భంగిమలను ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ అసభ్యకరమైన టాస్కుకు సంబంధించిన ఎపిసోడ్ రీసెంట్గా విడుదలైంది. దాంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లేడీ కంటెస్టెంట్లకు ఇష్టం లేకున్నా కూడా అలాంటి టాస్కులు ఇచ్చి ఇబ్బంది పెట్టారని విమర్శలు మొదలయ్యాయి.
అజాజ్ ఖాన్, నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు..
హౌస్ అరెస్ట్ రియాలిటీ షోకు సంబంధించిన రీసెంట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం వివాదానికి దారితీసింది. అలాంటి అసభ్యకరమైన టాస్కులపై ప్రజా ప్రతినిధులు, సంఘసంస్కర్తలు, మహిళా ప్రతినిధులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బజరంగ్ దళ్ నేత గౌతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటి దారుణమైన షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆ షోపై నేషనల్ విమెన్ కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై లోని అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే చర్యలు చేపట్టారు. అజాజ్ ఖాన్, నిర్మాత రాజ్ కుమార్ పాండే, ఉల్లు యాప్ సీఈఓ వీభూ అగర్వాల్ పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. వారిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
అజాజ్ ఖాన్ తెలుగు సినిమాలు..
బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు అజాజ్ ఖాన్ తెలుగు ప్రేక్షకులను కూడా పలు చిత్రాలతో అలరించారు. తెలుగులో ఆయన స్టార్ హీరోలకు సంబంధించిన చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు. మొదటగా రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్త చరిత్ర 2, మహేష్ బాబు దూకుడు, ఎన్టీఆర్ బాద్షా, టెంపర్, వేట, హార్ట్ ఎటాక్, రామ్ చరణ్ నాయక్ వంటి చిత్రాల్లో నటించారు. చివరిగా పూరి జగన్నాథ్ నిర్మించిన రోగ్ అనే చిత్రంలో నటించారు.


Click it and Unblock the Notifications











