చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు కథనాలు.. యూట్యూబ్ ఛానల్‌పై కేసు..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై పోలీసులు స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ యూట్యూబ్ ఛానల్ మెగాస్టార్ హెల్త్ కండిషన్ క్షీణించిందంటూ మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు సమాచారాన్ని చేస్తుందనీ, సదరు యూట్యూబ్ ఛానల్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారట.దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే?

కమలాపురి కాలనీకి చెందిన న్యాయవాది రామకృష్ణ మిర్యాల ఈ విషయంపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదులో, సదరు యూట్యూబ్ ఛానల్ కావాలనే వ్యూస్ కోసం చిరంజీవి ఆరోగ్యం గురించి పూర్తిగా అవాస్తవమైన సమాచారాన్ని ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. మార్ఫింగ్ చేసిన వీడియోలు, ఫోటోల ద్వారా ప్రేక్షకులను తప్పుదారి పట్టించడమే కాకుండా, ఒక సీనియర్ నటుడి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కంటెంట్ రూపొందించబడిందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు బలమైన ఆధారాలుగా వీడియో లింకులు, స్క్రీన్ షాట్లను కూడా పోలీసులకు సమర్పించారు.

Police Case Against YouTube Channel for Fake Health Rumors on Megastar Chiranjeevi

ఈ ఫిర్యాదును పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు ముందుగా ప్రాథమిక దర్యాప్తు నిర్వహించి, తదనంతరం కోర్టు అనుమతిని తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ తప్పుడు ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే దిశగా దర్యాప్తును వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తూ, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, ఆరోగ్యం వంటి సున్నిత అంశాలపై అసత్యాలు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రముఖుల విషయంలో అసత్య సమాచారం క్షణాల్లో వైరల్ అయి అభిమానుల్లో ఆందోళన, గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే, కెరీర్ పరంగా చిరంజీవి వరుస విజయాలతో ముందుకెళ్తున్నారు. ఇటీవల 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం దర్శకుడు బాబీతో కొత్త సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సూపర్ హిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా, దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులతో బిజీగా ఉంది. త్రిష, ఆశికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 14 లోకాల నేపథ్యంతో రూపొందుతూ ఈ ఏడాదే విడుదలకు సిద్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X