మార్కో హీరోపై కేసు.. తన మేనేజర్ పైనే దాడి.. ఎందుకు? ఏమైంది?

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ పై తాజాగా పోలీసు కేసు నమోదైంది. ఆయన మాజీ మేనేజర్ విపిన్ కుమార్ కేసు ఫైల్ చేయించడం షాకింగ్ గా మారింది. అతనిపై ఉన్ని ముకుందన్ భౌతిక దాడి చేశాడని, దుర్భాషలాడాడని మాజీ మేనేజర్ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసేందుకు సమగ్రమైన వివరాలను వెల్లడిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ఉన్ని ముకుందన్ తన దగ్గర పని చేసిన మేనేజర్ పై ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చిందనేది ఆశ్చర్యకరంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉన్ని ముకుందన్ సినిమాలు..
మలయాళం, తమిళ చిత్రాలతో ఉన్ని ముకుందన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల్లో తన నటకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తమిళం, మలయాళంలో చాలా వరకు గుర్తుండి పోయే సినిమాలు చేశారు. తెలుగులోనూ భారీ చిత్రాల్లోనే నటించారు. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజీ', భాగమతి, ఖిలాడి, సమంత రూత్ ప్రభు యశోద వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు.

Police Case filed against Marco Movie Hero Unni Mukundan

ఉన్ని ముకుందన్ పై కేసు ఎందుకు?
ఉన్ని ముకుందన్ కు మలయాళం, తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు ఉంది. ప్రేక్షకుల్లోనూ ఆయన నటనకు ప్రశంసలు అందుతుండటంతో అంతకంతకు క్రేజ్ దక్కించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఉన్ని ముకుందన్ దగ్గర కొన్నాళ్లు మేనేజర్ గా పని చేసిన విపిన్ కుమార్ పై తాజాగా ఉన్ని ముకుందన్ చేయి చేసుకున్నారు. అయితే మాజీ మేనేజర్ విపిన్ ఉన్ని ముకుందన్ కు నచ్చిన మరో నటుడి ఫొటోలను తన అకౌంట్ లో పోస్ట్ చేయడంతో కొచ్చి లోని తన ప్లాట్ లోనే దాడికి పాల్పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు..

ఆ నటుడితో ఉన్ని ముకుందన్ కు గొడవలు?
ఉన్ని ముకుందన్ కు మలయాళంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో నటుడు 2018 సినిమా హీరో టోవినో థామస్ తో గొడవలు ఉన్నాయని అక్కడి మీడియా తెలుపుతోంది. అయితే ఉన్ని ముకుందన్ మాజీ మేనేజర్ విపిన్ టోవినో ఫొటోలనే తన ఫేస్ బుక్ అకౌంట్ లో పెట్టడంతో ఎటాక్ చేసినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరికి ఇండస్ట్రీలో ఐడెంటిటీ విషయంలో పడటం లేదని అంటున్నారు. ఇటీవల ఒకరిపై ఒకరు పరోక్షంగా ఘాటుగానే విమర్శలు చేసుకున్నారని తెలుస్తోంది. తమ రీసెంట్ చిత్రాల్లోనూ పరోక్షంగా ఒకరిపై మరొకరు రెచ్చగొట్టే సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు.

మార్కోతో రూ.100 కోట్ల హీరోగా..
గతేడాది ఉన్ని ముకుందన్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మార్కో చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. రూ.30 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ.110 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దీంతో 100 కోట్ల సినిమా కలెక్షన్ హీరోగా మారిపోయాడు. రీసెంట్ గా గెట్ - సెట్ - రెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నెక్ట్స్ 'మిండియుమ్ పరంజుమ్' అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఉన్ని ముకుందన్ నటుడిగానే కాకుండా నిర్మాతగానూ సినిమాలు చేస్తూ ఉండటం విశేషం.

More from Filmibeat

Read more about: unni mukundan marco police case
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X