twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరాటే కళ్యాణిపై కేసు నమోదు.. అత్యాచారానికి గురైన బాలిక వివరాలు అలా పోస్ట్ చేయడంతో..

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కరాటే కళ్యాణి ఇటీవల మరో వివాదంలో చిక్కుకుంది. గత కొంతకాలంగా ఆమె సినిమాలతో పాటు ఇతర సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల ఊహించని విధంగా ఆమె ఒక అత్యాచారం కేసు పై స్పందించిన విధానంతో ఇరకాటంలో పడాల్సి వచ్చింది. కళ్యాణి పై ఒక వ్యక్తి కేసు నమోదు చేసినట్లు గా ప్రస్తుతం టాలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

     ఆ సినిమాలతో క్రేజ్..

    ఆ సినిమాలతో క్రేజ్..

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కరాటే కళ్యాణి ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. అప్పట్లో ఆమె కృష్ణ సినిమాలో బ్రహ్మానందం తో చేసిన క్యారెక్టర్ తో ఒక్కసారిగా మంచి క్రేజ్ అందుకున్నారు ఆ తర్వాత రవితేజ మిరపకాయ్ వంటి సినిమాల్లో కూడా ఆమె చేసిన డిఫరెంట్ బోల్డ్ పాత్రకి మంచి క్రేజ్ తగ్గింది.

    పాలిటిక్స్ లో బిజీగా..

    పాలిటిక్స్ లో బిజీగా..

    ఇక బిగ్ బాస్ నాలుగో సీజన్ లో కూడా కరాటే కళ్యాణి కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. కానీ అందులో ఆమె ఎక్కువ కాలం ముందుకు కొనసాగలేక పోయింది. అయితే బిగ్ బాస్ తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా చేరి అనేక రకాల సామాజిక అంశాలపై కూడా పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పేద కళాకారుల కోసం కూడా ఆమె తనదైన శైలిలో పోరాడే ప్రయత్నం చేసింది. కొందరికి వారికి ఆర్థికంగా కూడా సహాయం చేసింది.

    కేసు నమోదు..

    కేసు నమోదు..

    అయితే ఇటీవల కరాటే కళ్యాణి ఊహించని విధంగా ఓ కేసులో ఇరుక్కోవడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో సింగరేణి కాలనీ లో అత్యాచారం ఘటన కు గురైన ఒక బాలిక వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని ఒక వ్యక్తి కరాటే కళ్యాణి పై కేసు నమోదు చేశారు. అత్యాచారం, హత్యకు గురైన బాలిక వివరాలను సోషల్‌ మీడియా ద్వారా బహిర్గతం చేయడం సరైనది కాదని వారి కుటుంబ ప్రైవసీకి ఇబ్బంది కలిసించడమే అని జగద్గిరిగుట్ట పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

    నితేష్‌ అనే వ్యక్తి పిర్యాదు..

    నితేష్‌ అనే వ్యక్తి పిర్యాదు..

    కరాటే కళ్యాణి తప్పు చేశారని రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన నితేష్‌ అనే వ్యక్తి పిర్యాదు చేయడంతో పోలీస్ కేసు నమోదు చేశారు. ఆమెపై వెంటనే కేసు నమోదు చేయాలని కోర్టు కూడా ఆదేశించడంతో జగద్గిరి గుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంలో కరాటే కళ్యాణి వివరణ ఇవ్వాల్సి ఉంది.

    లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్

    లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్

    కల్యాణి ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన మహిళ. మరియు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అయిన పడాల రాందాస్ ఆమె తండ్రి. ఆమె యుక్త వయసులోనే కరాటేలో బ్లాక్ బెల్ట్ గెలుచుకుంది. ఇక కళ్యాణి ఛత్రపతి, కృష్ణ, మిరపకాయ్ వంటి సినిమాలతో బోల్డ్ క్యారెక్టర్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. హరికథ ప్రచారం కోసం ఆమె ఆదిభట్ల కళాపీఠాన్ని స్థాపించారు. జూన్ 2015లో, ఆమె 114 గంటల 45 నిమిషాల 55 సెకన్ల పాటు హరికథను నిరంతరం ప్రదర్శించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

    English summary
    Police Case filed on charecter artist karate kalyani
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X