హాట్ ఇష్యూ: శ్రీ రెడ్డిపై పోలీస్ కేసు.. బూతు మాటలతో రచ్చ.. రాకేష్ మాస్టర్ సెన్సేషన్
రాకేష్ మాస్టర్- శ్రీ రెడ్డి నడుమ నడుస్తున్న వివాదం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు రెచ్చిపోయి కామెంట్స్ చేసుకుంటూ గత వారం రోజులుగా రచ్చ రచ్చ చేస్తున్నారు. చివరకు ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కి చేరింది. శ్రీ రెడ్డిపై పోలీస్ కంప్లైంట్ చేశాడు రాకేష్ మాస్టర్. దీంతో ఈ ఇష్యూ మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలేంటో చూద్దామా..

రాకేష్ మాస్టర్ రమ్మన్నాడు.. రచ్చకెక్కిన ఇష్యూ
సినీ పెద్దలపై సోషల్ మీడియా వేదికగా లైంగిక ఆరోపణలు చేస్తూ నానా హంగామా చేస్తున్న శ్రీ రెడ్డి.. రాకేష్ మాస్టర్‌నీ వదిలి పెట్టలేదు. రాకేష్ మాస్టర్ తనను డిన్నర్‌కి పిలిచాడని పేర్కొంటూ ఆయన ప్రవర్తనపై సంచలన కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. దీనిపై రాకేష్ మాస్టర్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. దీంతో ఈ ఇష్యూ రెచ్చకెక్కింది.

బూతు పదజాలం.. సంచలన కామెంట్స్
ఫిబ్రవరి 15 రాత్రి లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణి, పవన్ కళ్యాణ్ ఇలా అందర్నీ ఓ రౌండ్ వేసుకుంది. బూతు పదజాలం ఉపయోగిస్తూ సంచలన కామెంట్స్ చేసింది. దీంతో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బహిరంగ సవాల్ విసిరాడు రాకేష్ మాష్టర్. తానే గనక మిస్ బెహేవ్ చేసి ఉంటే.. ఆ ఆడియో బయటపెట్టమని అన్నాడు.

నీ సంగతి తేలుస్తా శ్రీరెడ్డి..
''బరితెగించి ఒళ్లంతా తిప్పుతూ ఫేస్‌బుక్‌లో ఎంతమందిపై ఇలా అబాండాలు మోపుతుంది. పైగా మాట్లాడితే నా ఇష్టం నీకేం ఇబ్బంది అంటుంది. ఇప్పుడు నేను కూడా అంటున్నా. నా ఇష్టం నేను నీ గురించి మాట్లాడుతున్నా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. అబద్ధం ఆడేవాళ్లకు తెలివి అవసరం. నిజం చెప్పేవాడికి ధైర్యం ఉంటే చాలు. నాకు ధైర్యం ఉంది. ఏ ఛానల్‌కి అయినా రా.. శ్రీరెడ్డి! నీ సంగతి తేలుస్తా'' అంటూ ఇటీవలే ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు రాకేష్ మాస్టర్.

శ్రీరెడ్డిపై పోలీస్ కేసు.. బూతు మాటలతో రచ్చ
ఇక బుధవారం రోజు ఇదే విషయమై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు రాకేష్ మాస్టర్. శ్రీ రెడ్డి కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ సహా, మరికొంతమంది నటులపై అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ పోస్టులు పెడుతోందని.. ఇలా చేయొద్దని చెప్పినందుకు తనపై కూడా బూతు మాటలతో రెచ్చిపోతోందని రాకేష్ పోలీసులకు తెలిపాడు.

శ్రీ రెడ్డి అరెస్ట్.. పోలీసులకు వినతి
రాకేష్ స్టేట్‌మెంట్ విన్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు వివరాలు నోట్ చేసుకొని.. ఇటీవలే కరాటే కళ్యాణి శ్రీ రెడ్డిపై ఇదే కారణంతో పెట్టిన కేసుకు జత చేశారు.
తనను ఉద్దేశించి శ్రీరెడ్డి అసభ్యంగా మాట్లాడిందని, ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఇటీవలే కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలనీ ఆమె కోరింది.
Recommended Video


ఆ అవకాశాలు పుష్కలం.. కేసు ఫైల్
కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు.. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరిపి శ్రీరెడ్డిపై 67 ఐటీ యాక్ట్, 506, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసుకు రాకేష్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మరింత బలం చేకూర్చింది. ఈ క్రమంలో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











