Jani Master Case : జానీ మాస్టర్‌‌ బెయిల్ క్యాన్సిల్?

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్‌పై బయటికొచ్చిన టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు పోలీసులు మరో షాకిచ్చారు. జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ రద్దయిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం అనుమతిస్తే గనుక ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావిస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువ మహిళ కొరియోగ్రాఫర్ గత నెలలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్ట్ ఆదేశాల మేరకు జానీ మాస్టర్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఈ వ్యవహారం టాలీవుడ్‌లో కలకలం రేపింది.

police filed petition in ranga reddy District court to cancel the bail of choreographer jani master

జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక విషయాలు బయటపడతాయని భావించిన పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా స్పెషల్ ఫోక్సో కోర్టు జానీ మాస్టర్‌ను 4 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే జానీ మాస్టర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని, ఆయన లాయర్ సమక్షంలోనే విచారణ నిర్వహించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.

అయితే బెయిల్ పొందేందుకు జానీ మాస్టర్ తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. అక్టోబర్ 8న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లేందుకు గాను తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం అక్టోబర్ 6 నుంచి 9 వరకు జానీ మాస్టర్‌కు మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది.

కానీ జానీ మాస్టర్ అవార్డ్ తీసుకునే లోపే కీలక పరిణామం చోటు చేసుకుంది. జానీపై లైంగిక వేధింపుల కేసుతో పాటు పోక్సో కేసు నమోదై రిమాండ్‌లో ఉండటంతో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ కీలక ప్రకటన చేసింది. జానీ మాస్టర్‌కు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో జానీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది. ఆ లోపే పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. నేషనల్ అవార్డ్ కమిటీ జానీ మాస్టర్‌కు పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించడంతో జానీ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాల్సిందిగా పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి జానీ బెయిల్ రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మాస్టర్ ఎలాంటి స్టెప్ వేస్తారనేది ఉత్కంఠగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X