వైరల్ వీడియో : అల్లు అర్జున్ పాటను భలే వాడేశారే!.. కరోనాపై పోలీసుల వినూత్న ప్రచారం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించడానికి అన్ని మార్గాలను ఎంచుకుంటోంది ప్రభుత్వం. సెలెబ్రిటీల చేత సందేశాలను చెప్పిస్తోంది. కరోనా సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తోంది. అయితే సామాన్య జనాలు, నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యేట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ఈ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

వణికిస్తోన్న కరోనా..
చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలోనూ రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సంఖ్య 300 దాటి పోయింది.

వినూత్న ప్రచారం..
కరోనా వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, శానిటైజర్‌ను వాడాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు కర్ఛీఫ్‌ను అడ్డం పెట్టుకోవాలని, నిత్యం మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. సినీ స్టార్స్ సైతం వీడియో సందేశాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగేందుకు ప్రయత్నించారు. పోలీసులు కూడా వినూత్న ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు.
రాములో రాముల పాట ద్వారా..
జనాల్లోకి ఏదైనా దగ్గరగా వెళ్లాలంటే వారికి నచ్చిన, మెచ్చిన, తెలిసిన దారిలోనే చెప్పాలి. ప్రస్తుతం రెండు రాష్ట్రల్లో రాములో రాముల అనే పాట తెలియకుండా ఉండదు. అందుకు కరోనా సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ పాట ద్వారా వివరించారు.
Recommended Video

పోలీసుల స్టెప్పులు వైరల్..
చేతులు బాగా కడుక్కోవాలి, దాదాపు 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి, తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు అడ్గుగా చేతులను పెట్టుకోవాలని అర్థమయ్యేట్టు సైగలు చేస్తూ వేసిన స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











