twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా వివాదంలో మ‌రో ట్విస్ట్‌.. మా ఎన్నిక‌ల సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేసిన పోలీసులు

    |

    టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా కు సంబంధించిన గొడవలు రోజుకొకటి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎన్నికల అనౌన్స్మెంట్ వచ్చినప్పటినుంచి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మీడియాలో హైలెట్ అవుతూ వస్తున్నారు. గతంలోనే 'మా'కు సంబంధించిన అనేక రకాల గొడవలు మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. గొడవలు జరగకుండా ఉండాలని సినీ పెద్దలు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏవి కూడా సఫలం కావడం లేదు.

    ఇక ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా అదే తరహాలో గొడవలు జరుగుతున్నాయి. మా ఎలక్షన్ రోజున మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారంటు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఇక ఇప్పుడు ఆ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు పోలిసులు తాళం వేశారు.

    ఎలక్షన్ రోజు గొడవలు

    ఎలక్షన్ రోజు గొడవలు

    ఆదివారం టాలీవుడ్ మా అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికలలో మొదట చాలా ప్రశాంతంగా మొదలయ్యాయి. కానీ రెండు గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బయట నుంచి వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు అని ప్రకాష్ రాజ్ కు సంబంధించిన ప్యానెల్ సభ్యులు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇక చర్చలు జరుగుతున్న క్రమంలోనే ఒక్కసారిగా ఇరువర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. మాటా మాటా పెరగడంతో ఆ వివాదం కొట్టుకునే వరకు వెళ్లినట్లు కొంతమంది ఆరోపించారు.

    మాపై దాడి చేశారు

    మాపై దాడి చేశారు

    ప్రకాష్ రాజ్ ప్యానెల్ మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా దాడి కూడా చేసుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే ప్రకాష్ రాజ్ కు సంబంధించిన కొంత మంది మంచు విష్ణు కమిటీ సభ్యుల పై ఆరోపణలు చేశారు. ఇక మా ఎలక్షన్ రోజున మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారని ప్రకాష్ రాజ్ తో పాటు వారి ప్యానెల్ సభ్యులు మీడియాకు తెలియజేశారు.

    సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని చెప్పడంతో..

    సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని చెప్పడంతో..

    దాడి దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో ఉన్నాయని కూడా చెప్పడంతో ఆ వివాదం ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచింది. తమకు సీసీ ఫుటేజ్ అందజేయాలని ఎన్నికల అధికారిని ప్రకాష్ రాజ్ కోరినప్పటికీ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ తెలియజేశారు. దీంతో ఈ ఎన్నికలపై మరిన్ని అనుమానాలు ఉన్నాయని కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే గెలిచిన 11 మంది రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.

    Recommended Video

    Exclusive Interview with Bigg Boss 5 Contestant Hamida || Filmibeat Telugu
    సీసీ ఫుటేజ్ ను సీజ్ చేసిన పోలీసులు

    సీసీ ఫుటేజ్ ను సీజ్ చేసిన పోలీసులు

    మా వివాదంలో కొత్త కోణం గొడవ మోదలవ్వడంతో ఇండస్ట్రీలో కూడా విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మా ఎలక్షన్ టైం సీసీ ఫుటేజ్ చాలా కీలకంగా మారునున్నట్లు అర్ధమవుతోంది.

    ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రతరం కాకముందే సీసీ ఫుటేజ్ ను జూబ్లిహిల్స్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఇక సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని కూడా ప్రకాష్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు పోలీసులు తాళం వేశారు.

    English summary
    Police seize CCTV footage of the maa elections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X