త్వరగానే ముగిసిన గుంటూరు కారం ఈవెంట్.. మహేశ్, త్రివిక్రమ్ అందుకే అలా చేశారా!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన మార్కును క్రియేట్ చేసుకుని.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో టాప్ హీరోగా సత్తా చాటుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. పక్కా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోన్న అతడు.. సినిమా సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోన్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్ బాబు 'గుంటూరు కారం' అనే మూవీలో నటించాడు. ఎన్నో అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తికరమైన వార్త లీకైంది. ఆ వివరాలను మీరే చూడండి!

ఘాటు చూపించేలా మహేశ్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన సినిమానే 'గుంటూరు కారం'. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటించారు. అలాగే, ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలు చేశారు. థమన్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.

ప్రమోషన్ జోరు.. సందడిగా: పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలను కూడా విడుదల చేసింది. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేసింది. దీంతో ఈ మూవీ సందడే భారీగా కనిపిస్తోంది.

ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌గా: మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గుంటూరులో నిర్వహించారు. ఓపెన్ గ్రౌండ్‌లో జరిగిన ఈ ఫంక్షన్ ఎంతో సందడిగా సాగింది. దీనికి వేల సంఖ్యలో అభిమానులు వచ్చి ఈవెంట్‌ను విజయవంతం చేసేశారు.

త్వరగానే ముగిసిన ఫంక్షన్: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఓపెన్ గ్రౌండ్‌లో ఎంతో వైభవంగా నిర్వహించారు. ఇందులో తమ అభిమాన హీరోను చూసేందుకు మహేశ్ అభిమానులు వేల సంఖ్యలో హాజరయ్యారు. అయితే, ఊహించని విధంగా ఈ ఈవెంట్‌ను 8:30 గంటలలోపే ముగించేశారు. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
స్టార్ హీరోల్లో తొలిసారిగా: 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా త్వరగానే పూర్తైంది. ముఖ్యంగా ఇందులో మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా చాలా మంది ప్రముఖులు అతి తక్కువ సమయంలోనే తమ తమ స్పీచ్‌లను ముగించారు. దీంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. అదే సమయంలో ఈ ఈవెంట్‌ను ఎందుకు ఇంత త్వరగా కంప్లీట్ చేశారని అందరూ చర్చించుకుంటున్నారు.

పోలీసులు రిక్వెస్ట్ చేయగా: వాస్తవానికి 'గుంటూరు కారం' ఈవెంట్‌ను ఎక్కువ సేపే చేయాలని అనుకున్నారు. కానీ, గ్రౌండ్ బయట, హైవే మీద సుమారు 25000 మంది అభిమానులు చేరారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ కారణంగానే పోలీసులు వచ్చి చిత్ర యూనిట్‌ను త్వరగా ముగించాలని రిక్వెస్ట్ చేశారట. అందుకే ఈ ఈవెంట్‌ను త్వరగా ముగించారని తాజాగా తెలిసింది.


Click it and Unblock the Notifications











