twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ మామలో రాజకీయం.. ఒక రేంజ్‌లో సన్నివేశం!

    |

    వెంకటేష్ కొత్త చిత్రం వెంకీ మామ షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా ఈ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని దరకుడు బాబీ. వెంకటేష్ వరుసగా మల్టీస్టార్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇటీవల ఉగాది సందర్భంగా వెంకీ మామ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్‌లో వెంకటేష్, నాగ చైతన్య కూల్ లుక్‌లో కనిపిస్తున్నారు. రైతులు, జవాన్ల ప్రాముఖ్యతని తెలియజేసేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

    తాజాగా ఈ చిత్రంలో మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. వెంకీ మామ చిత్రంలో రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ వెంకీ మామ చిత్రంలో అత్యంత కీలకమైన రాజకీయ సన్నివేశాలు చిత్రీకరిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్, నాగచైతన్య తోపాటు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు కలసి నటించే ఈ సన్నివేశాలు వెంకీ మామ చిత్రంలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

     Political touch in Venkatesh, Naga Chaitanyas Venky Mama movie

    జైలవకుశ తర్వాత దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి దసరాకు విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.

    English summary
    Political touch in Venkatesh, Naga Chaitanya's Venky Mama movie. K. S. Ravindra(Bobby) is directing this movie. Payal Rajput, Rashi Khanna are heroines
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X