twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రకాశ్ రాజ్‌ను అంత మాట అనేసిన భార్య.. వైరలవుతోన్న ట్వీట్

    |

    ప్రకాశ్ రాజ్, డైరెక్టర్ కృష్ణవంశీ ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలిసిందే. ఏరా అనుకునేంత స్నేహం వీరిద్దరిదీ. మధ్యలో ఈ ఇద్దరికీ కాస్త గ్యాప్ వచ్చినా మళ్లీ మామూలుగా ఒక్కటయ్యారు. కృష్ణవంశీ సినిమాల్లో ప్రకాశ్ రాజ్‌కు అదిరిపోయే క్యారెక్టర్స్ పడుతూ ఉంటాయి. అయితే మళ్లీ వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ఓ సినిమాను ప్రారంభించిన కృష్ణ వంశీ ప్రకాశ్ రాజ్‌కు ఓ మంచి పాత్రను ఇచ్చినట్టు కనిపిస్తోంది.

    ప్రస్తుతం కృష్ణవంశీ, ప్రకాశ్ రాజ్ కలిసి ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న రాత్రి కృష్ణ వంశీ.. ప్రకాశ్ రాజ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి చాలా సేపు ముచ్చటించుకున్నట్లు అర్థమవుతోంది. ప్రకాశ్ రాజ్ భార్య పోనీ వర్మ వీరిద్దరూ కలిసి ఫోన్‌లో ఏదో చూస్తూ ఉన్న ఫోటోను పిక్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్‌ను చేసింది.

    Pony Verma Posted Krishna Vamsi And Prakash Raj Pic

    దెయ్యాలు పనిలో ఉన్నాయి.. అంటూ వీరిద్దరి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ట్వీట్‌కు కృష్ణవంశీ రిప్లై ఇస్తూ లాస్ట్ నైట్ లాస్ట్ అంటూ (Last night Lost) తన స్టైల్లో బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో వీరిద్దరికి పని రాక్షసులు అని పేరున్న సంగతి తెలిసిందే. అందుకే పోనీ వర్మ ఫన్నీగా కామెంట్ చేస్తూ అలా ట్వీట్ చేసిందని కామెంట్లు చేస్తున్నారు. ఇంతవరకు రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల సినిమాలపై ఫోకస్ తగ్గించిన ప్రకాశ్ రాజ్.. ఇక వరుసగా ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

    English summary
    Krishna Vamsi And Prakasah Raj Pic Goes Viral. Pony Varma Posted That Pic And Made A Interesting Comment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X