ఎగిరి గంతేయాలనిపిస్తున్నది.. పూజా హెగ్డే... మహేష్ గుండెలపై వాలిపోయి..
సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మైలురాయి చిత్రంగా తెరకెక్కిన మహర్షి చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తున్నది. హృదయానికి టచ్ చేసే కథతో రూపొందిందనే ఫీడ్ బ్యాక్ అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి వచ్చింది. అయితే కథనం కాస్త నెమ్మదించిందనే ఫిర్యాదు కూడా వినిపించింది. ఇలాంటి రియాక్షన్ల మధ్య వసూళ్లు భారీగానే నమోదయ్యాయి.
ఈ క్రమంలో అందాల తార పూజా హెగ్డే ఖాతాలో మరో హిట్ చేరింది. తాజాగా ఆమె నటించిన మహర్షి చిత్రం భారీ సక్సెస్ వైపు దూసుకెళ్తున్నది. సినిమా రిలీజ్ అనంతరం టీమ్‌తో కలిసి స్వీట్లు పంచుకొన్నారు. టపాసులు కాల్చి విజయానందాన్ని పొందారు. తాజాగా మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మహర్షి సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమ, ఈ సినిమాకు వస్తున్న ప్రశంసలు చూసి సంతోషంలో మునిగిపోతున్నాను. ఆనందం పట్టలేక ఎగిరి గెంతులేయాలని అనిపిస్తున్నది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెచ్చిపోయి కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది.
అంతేకాకుండా మహర్షి సినిమాలోని ఓ పాట షూటింగ్ సందర్భంగా చిత్రీకరించిన వీడియో లింక్‌ను షేర్ చేసింది. ఆ పాటలో డ్యాన్స్ చేసిన పూజా హెగ్డే మహేష్ గుండెలపై వాలిపోయింది. ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్‌లో ఆమె వీడియో ట్రెండ్ అవుతున్నది.
మహర్షి చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా మీనాక్షి దీక్షిత్, అల్లరి నరేష్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇంకా ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సాయి కుమార్, జయసుధ నటించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, చోటీ చోటీ బాతే, పదర పదర అనే పాటలకు మంచి ప్రజాదరణ లభించింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే టాప్‌గా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ అనలిస్టులు వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











