twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radhe Shyam నుంచి ప్రేరణ వచ్చేసింది.. రిలీజ్ డేట్‌పైనా క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ టీమ్

    |

    కొంత కాలంగా వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు యూనివర్శల్ స్టార్ ప్రభాస్. ఇంత కాలం టాలీవుడ్‌లో తన హవాను చూపించిన అతడు.. 'బహుబలి' సిరీస్ తర్వాత పంథాను మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఏకంగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఇండియా వ్యాప్తంగా తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకుంటున్నాడు. అదే సమయంలో మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇక, ఇప్పుడు ఈ రెబెల్ స్టార్ నటిస్తోన్న చిత్రాల్లో రొమాంటిక్ థ్రిల్లర్‌గా వస్తున్న 'రాధే శ్యామ్' ఒకటి.

    స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయిస్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

    జిల్ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగా అవుతోంది. మధ్యలో కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు ఆటంకాలు ఏర్పడడంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంటే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో గ్రీన్ మ్యాట్ సీన్స్ (గ్రాఫిక్) ఎక్కువగా ఉండడంతో దీనికి చాలా సమయం పడుతుందనే టాక్ వినిపిస్తోంది.

    Pooja Hegde Birthday Special Poster From Prabhass Radhe Shyam

    'రాధే శ్యామ్' మూవీ నుంచి ఆరంభంలో పెద్దగా అప్‌డేట్లు వచ్చేవి కాదు. దీంతో ప్రభాస్ అభిమానులు నిర్మాణ సంస్థపై అసహనం వెల్లగక్కేవారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనిట్ తరచూ ఏదో ఒక పోస్టర్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో అప్‌డేట్ వచ్చింది. ఈరోజు (అక్టోబర్ 13) బుట్టబొమ్మ పూజా హెగ్డే పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని 'రాధే శ్యామ్' సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా 'అందరి కలల రాణి.. మా ప్రేరణకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేసింది.

    హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

    ఇక, RRR మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవలే ప్రకటించారు. దీంతో ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న పలు చిత్రాలను వాయిదా వేయబోతున్నారన్న ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జనవరి 14న రావాల్సిన 'రాధే శ్యామ్' మూవీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పూజా హెగ్డే పోస్టర్‌లో దీన్ని జనవరి 14నే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అనుమానాలకు ఇలా పుల్‌స్టాప్ పెట్టేశారు. దీనిపై ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ కార్ల దొంగగా నటిస్తోన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

    English summary
    Prabhas upcoming film is Radhe Shyam Under Radha Krishna Kumar Direction. Now Pooja Hegde Birthday Special Poster Released From This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X