అక్కినేని వారసుడితో పూజా హెగ్డే రొమాన్స్.. కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ ప్రకటన
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోయిన్ కష్టాలు ఎట్టకేలకు తీరిపోయాయి. అఖిల్ హీరోగా రాబోతున్న నాలుగో సినిమా హీరోయిన్ సెలక్షన్ విషయంలో చాలా రోజులుగా తీవ్ర అన్వేషణలో పడిన చిత్రయూనిట్ చివరకు క్రేజీ భామ పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేసింది. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన జారీ చేస్తూ ట్వీట్ చేశారు. ఎప్పటి నుంచో పూజానే కన్ఫర్మ్ అనే వార్తలు వస్తున్నప్పటికీ అఫీషియల్ సమాచారం రావడంతో కొన్ని రూమర్స్‌కి చెక్ పడింది.
''అఖిల్, హలో, మిస్టర్ మజ్ను'' సినిమాలతో ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో కనీసం నాలుగో సినిమాతోనైనా బ్రేక్ తెచ్చుకోవాలని కసిగా ఉన్నాడు అక్కినేని అఖిల్. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై స్పెషల్ కేర్ తీసుకొని.. ఆమె వెయిటేజ్ కూడా ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం. ఈ మేరకు పూజా హెగ్డేకు రెమ్మ్యూనరేషన్ కూడా భారీ గానీ ఆఫర్ చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కూడిన కాథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట బొమ్మరిల్లు భాస్కర్. పైగా ఈ సినిమాకు ఓ క్యాచీ టైటిల్ కూడా ఫైనల్ చేశారని తెలుస్తోంది. అతి త్వరలో సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











