ఆ హీరోతో అందరి ముందే.. భయంతో వణికిపోయా.. సీక్రెట్ బయటపెట్టిన పూజా హెగ్డే

ప్రస్తుతం అందాల భామ హీరోయిన్ పూజా హెగ్డే టైమ్ నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై వరుస హిట్స్ పట్టేస్తున్న ఈ భామ స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ పట్టేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన పూజా.. సినిమాల్లో లిప్ లాక్స్ గురించి మాట్లాడుతూ తనకు సంబందించిన కొన్ని సీక్రెట్స్ చెప్పింది. వివరాల్లోకి పోతే..

టాలీవుడ్ స్టార్ హీరోలందరితో..

టాలీవుడ్ స్టార్ హీరోలందరితో..

మొదటి నుంచే గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే గత కొంతకాలంగా మరింతగా హాట్ ట్రీట్ ఇస్తోంది. మరోవైపు వరుస అవకాశాలు పట్టేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది. ముఖ్యంగా ఏడాది కాలంగా పూజా పరుగులను అందుకునే హీరోయినే కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ అందరితో వెండితెర రొమాన్స్ చేస్తోంది పూజా.

అందరి ముందు అలా లిప్‌లాక్ అంటే..

అందరి ముందు అలా లిప్‌లాక్ అంటే..

ఇక ఈ రోజుల్లో సినిమాలన్నాక లిప్ లాక్ సీన్స్ సాధారణమే. అయితే ఓ బాలీవుడ్ సినిమాలో లిప్ లాక్ సీన్ చేసిన పూజా హెగ్డే తన అనుభవం గురించి చెప్పుకొచ్చింది. అందరి ముందు అలా లిప్ లాక్ సీన్ చేయడం తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని పేర్కొంది.

డైరెక్ట‌ర్ చెప్పారు.. నేను కూడా రెడీ అయ్యాను కానీ..

డైరెక్ట‌ర్ చెప్పారు.. నేను కూడా రెడీ అయ్యాను కానీ..


చూసే ప్రేక్ష‌కుల‌కు ముద్దు స‌న్నివేశాలు బాగానే అనిపిస్తాయి కానీ.. ఆ సీన్ చేసే న‌టీన‌టులు చాలా క‌ష్ట‌పడాల్సి ఉంటుందని పూజా చెప్పింది. కాకపోతే అవేవీ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌వు అనేసింది. బాలీవుడ్ మూవీ మొహంజ‌దారోలో లిప్ లాక్ గురించి డైరెక్ట‌ర్ అశుతోష్ గోవారిక‌ర్ నాకు వివ‌రించారు. నేను కూడా ఆ సీన్‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌య్యాను అని చెప్పిన పూజా ఆ టైంలో తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలిపింది.

మా చుట్టూ చాలా మంది.. ఆ హీరోతో అందరి ముందు

మా చుట్టూ చాలా మంది.. ఆ హీరోతో అందరి ముందు

''మా చుట్టూ చాలా మంది జ‌నాలు నిల‌బ‌డి ఉండ‌టంతో ఆ హీరోతో ముద్దు సీన్ చేయడం నాకు క‌ష్టంగా అనిపించింది. ఒంటిలో వ‌ణుకు పుట్టింది. అందుకు కార‌ణం అంత‌కు ముందు నేను అలాంటి స‌న్నివేశంలో ఇప్పటిదాకా న‌టించ‌లేదు. రొమాంటిక్ స‌న్నివేశాల్లో కెమెరా ట్రిక్స్ కూడా కీల‌క పాత్ర‌ను పోషిస్తాయి. కొన్ని సందర్భాల్లో అవి కూడా అవసరమే అని చెప్పింది'' పూజా హెగ్డే.

ఇటు ప్రభాస్‌.. అటు అల్లు అర్జున్‌

ఇటు ప్రభాస్‌.. అటు అల్లు అర్జున్‌

ఇకపోతే పూజా హెగ్డే ఇటు ప్రభాస్‌తో, అటు అల్లు అర్జున్‌తో సినిమాలు చేస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమా ఫినిష్ చేసిన ఆమె.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'జాన్' సినిమాలో నటిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X