అఖిల్ షూస్‌ను చేతిలో పట్టుకున్న హీరోయిన్.. ఎందుకంటూ ఆరా..?
అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'గా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు చిత్రాలతో దెబ్బ తిని ఉన్న అఖిల్.. ఈ సినిమాతోనైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ వంటి అభిరుచి ఉన్న దర్శకుడితో ఈ సినిమా చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. అయితే ఈ దర్శకుడు కూడా విజయాన్ని చూసి చాలా కాలమే కావడంతో అక్కినేని అభిమానుల్లోనూ ఒకింత ఆందోళన ఉంది.
ఆ విషయాలన్నీ కాసేపు పక్కన పెడితే ఈ మూవీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. ఈ మూవీ నుంచి హీరోహీరోయిన్ల ఫస్ట్ లుక్స్‌ను రివీల్ చేస్తూ మెల్లి మెల్లిగా హైప్ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ స్టెప్ అంటూ అఖిల్ లుక్ రిలీజ్ చేశారు. అందులో షూస్ లేకుండా అలా రోడ్డుపై నడుస్తున్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) సందర్బంగా నిన్న పూజా హెగ్డే లుక్‌ను రివీల్ చేశారు. అక్కడ అఖిల్ కాళ్లకు ఉండాల్సిన షూస్.. విభా (పూజా హెగ్డే క్యారెక్టర్ పేరు) చేతిలో ఉన్నాయి. అది కూడా మామూలుగా కాదు.. మైకులో ఏదో అనౌన్స్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు ఫుల్ ఎగ్జైట్ మెంట్‌లో ఉంది. అఖిల్ కాళ్లకు ఉండాల్సినవి పూజా చేతుల్లోకి ఎలా వచ్చాయి..అవి అఖిల్ షూసేనా? ఇలా పలు రకాలుగా ఆరా తీస్తున్నారు. వీటన్నంటికి సమాధానం దొరకాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











