పుకార్లకు చెక్ పెట్టబోతున్న త్రివిక్రమ్: ఎన్టీఆర్ సినిమా కోసం ఆమెనే తీసుకొస్తున్నాడు

గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ విజయం ఇచ్చిన ఊపులో ఉన్న ఆయన.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన వెలువడి చాలా కాలం అయినా.. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రం పెద్దగా రావడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో నటించే హీరోయిన్ విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది.

'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇటీవల బాలీవుడ్ బ్యూటీలు జాన్వీ కపూర్, శ్రద్దా కపూర్, కియారా అద్వాణీ పేర్లు కూడా వినిపించాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో పూజా హెగ్డేను నటింపజేస్తున్నారట. ఇప్పటికే ఈ చిత్ర కథను ఆమెకు వినిపించడం.. దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయట.

Photos: Leaked Shocking Pictures of Indian Celebs

Pooja Hegde Fix for Jr NTR - Trivikram Movie

త్రివిక్రమ్ తెరకెక్కించిన గత రెండు చిత్రాలు 'అరవింద సమేత.. వీరరాఘవ', 'అల.. వైకుంఠపురములో'లో పూజా హెగ్డేనే హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడు మూడో సారి ఆయన సినిమాలో నటించబోతుందని అంటున్నారు. అయితే, ఇందులో మరో హీరోయిన్ ఉంటుందా? ఉండదా? అన్న విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అయితే, ఈ మధ్య దీనికి 'చౌడప్ప నాయుడు' అనే టైటిల్ పెడుతున్నట్లు తాజాగా మరో న్యూస్ లీకైన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X