Pooja Hegde in Bro Teaser: బ్రో సినిమాలో పూజ హెగ్డే... టీజర్ లో గమనించారా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ల బ్రో టీజర్ వచ్చేసింది. పవన్ వింటేజ్ లుక్స్, తేజ్ కామెడీ టైమింగ్, తమన్ మ్యూజిక్, సముద్రఖని షాట్స్, త్రివిక్రమ్ డైలాగులు.. ఇలా ప్రతి ఒక్కటి టీజర్ లో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా టీజర్ లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మెరిసింది. అదేంటి ఆమె ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా.. ఆ వివరాల్లోకి వెళితే....
వరుస హిట్లు.. వరుస ఫ్లాప్లు: నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే గత కొంత కాలంగా ఈ భామకు హిట్లు లేవనే చెప్పాలి. రాధేశ్యాం, బీస్ట్, ఆచార్య వంటి వరుస ఫ్లాప్ లు వచ్చాయి. అయినప్పటికీ మహేష్ గుంటూరు కారంలో ఛాన్స్ దక్కించుకుంది అనుకునే లోపే.. ఆ సినిమా నుంచి పూజా ఔట్ అంటూ వార్తలు వచ్చాయి.

బ్రోలోపూజా హెగ్డే ఏంటి: ప్రస్తుతం పూజా హెగ్డేకు తెలుగులో సినిమాలు లేవు. కానీ బ్రో చిత్రంలో కనిపించింది. బ్రో సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తుండగా.. పూజా హెగ్డే ఏంటీ అనుకుంటున్నారా.. ? అయితే అతిథి పాత్రలో మెరిసిందేమో, లేదా ఐటం సాంగ్స్ లో నటించిందేమో... అని మీరు అనుకుంటే పొరబడినట్లే.

అలా మెరిసింది: బ్రో టీజర్ ప్రారంభం కాకముందే... పూజా హెగ్డే ఎంట్రీ ఇస్తుంది. బ్రో టీజర్ ప్రారంభంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్ కనిపిస్తుంది. ఆ పోస్టర్ లో పూజా హెగ్డే కనిపిస్తుంది. దీన్ని చూసిన చాలా మంది నెటిజన్స్.. బ్రో సినిమాలో పూజ అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడీయాలో హాట్ టాపిగ్ మారింది ఈ విషయం. ఇదిలా ఉంటే.. బ్రో సినిమా ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. మొత్తానికి పవన్ సినిమాలో పూజా హెగ్డే మెరిసిందిలా.

ఇక సినిమా విషయానికి వస్తే: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న మొదటి చిత్రం ఇది. నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది.
తమిళంలో సూపర్ హిట్ అయిన వినొదయ సిత్తం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రంలో పవన్ మరోసారి దేవుడి పాత్రలో అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 28న అడియన్స్ ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











