ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూజా హెగ్డే మరో షాక్.. ఆ సినిమాకు ముఖం చాటేస్తూ..
హిందీ, తెలుగు, తమిళం అనే తేడా లేకుండా వరుసగా భారీ చిత్రాలతో అగ్ర నటులతో జతకడుతూ పూజా హెగ్డే ఆకట్టుకొంటున్నారు. చేతి నిండా ప్రాజెక్టులతో లాక్‌డౌన్ తర్వాత బిజీగా మారారు. తాజాగా ఎన్టీఆర్ మూవీలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆమె పీఆర్ వర్గాలు స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పూజా హెగ్గే టీమ్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో
కొద్ది రోజుల క్రితం ఎవరూ ఊహించని రీతిలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రానికి సంబంధించిన వార్త అభిమానులను ఉత్సాహం కలిగించింది. మరోసారి జనతా గ్యారేజ్‌ను మంచిన మూవీ రావడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లోనూ వ్యక్తమైంది. ఓ వైపు ఆచార్యను విడుదలకు సిద్దం చేస్తూనే ఎన్టీఆర్ సినిమాపై కొరటాల శివ కసరత్తు చేయడం మొదలుపెట్టారు.

ఎన్టీఆర్‌తో పూజా హెగ్డే హీరోయిన్‌గా
ఎన్టీఆర్, కొరటాల సినిమా ప్రారంభానికి ముందే ఈ ప్రాజెక్టులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. అయితే అటు సినిమా యూనిట్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ వార్తలో నిజముందని అంతా భావించారు. కానీ తాజాగా పూజా హెగ్డే ఎన్టీఆర్‌తో కలిసి కొరటాల శివ ప్రాజెక్టులో నటించడం లేదు అని ఓ వార్త బయటకు రావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

ఎవరూ సంప్రదింపులు జరుపలేదు అంటూ
పూజా హెగ్డే పీఆర్, పర్సనల్ స్టాఫ్ మీడియాతో తన సన్నిహితులతో పంచుకొన్న విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకు కొరటాల శివ యూనిట్ మాతో సంప్రదింపులు జరుపలేదు. ఈ ప్రాజెక్టు గురించి మాతో ఎవరూ మాట్లాడలేదు. స్క్రిప్టు కూడా ఇంత వరకు చెప్పలేదు. కాబట్టి ఎన్టీఆర్‌తో పూజా హెగ్డే కలిసి నటిస్తుందనే విషయంపై క్లారటీ లేదు అని పేర్కొన్నారు.

మహేష్, త్రివిక్రమ్‌తో
ఇదిలా ఉండగా, ప్రస్తుతం టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్టులో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తున్నది. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని తెలిసింది.

తమిళంలో బీస్ట్ చిత్రంలో
పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలో విజయ్‌తో బీస్ట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే చెన్నైలో ఓ షెడ్యూల్ ముగిసింది. ఇటీవల విజయ్, పూజా హెగ్డేపై పాటను చిత్రీకరించారు. త్వరలోనే మరో షెడ్యూల్ వడపళనిలో ప్రారంభం కానున్నది. ఈ షెడ్యూల్‌లో విజయ్, పూజా హెగ్డేపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసిందే.


Click it and Unblock the Notifications











