పూజా హెగ్డే షాకింగ్ లుక్.. శ్రీదేవి రూపంలో సైకిల్‌పై..!
యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే ఉన్నట్టుండి ఒకేసారి షాకిచ్చింది. లంగా ఓని వేసుకొని శ్రీదేవి రూపంలో సైకిల్‌పై అలా వచ్చి అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అదేనండీ వరుణ్ తేజ హీరోగా రూపొందుతున్న వాల్మీకి సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆ సినిమా నుంచి పూజా హెగ్డే స్టిల్ రిలీజ్ చేశారు.
ఈ స్టిల్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకునే పూజా.. ''శ్రీదేవిగా మీ మనసు దోచుకోవడానికి వచ్చేస్తున్నా'' అని పేర్కొంది. ఈ లుక్‌లో అచ్చమైన పల్లెటూరు అమ్మాయిలా లంగావోణీతో సైకిల్ తొక్కుతూ కనిపించింది పూజా హెగ్డే. ఇప్పటికే వాల్మీకి చిత్రంలో వరుణ్ తేజ్ లుక్ ఎంతో డిఫెరెంట్ అని తెలిసిపోయింది. తాజాగా ఇప్పుడు పూజా లుక్ కూడా మరింత డిఫెరెంట్‌గా ఉండటంతో సినిమా సరికొత్త హైప్ క్రియేట్ అయింది. మరోవైపు ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ''సూపర్ హిట్టు ఈల కొట్టు'' ఆడియన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది 'వాల్మీకి' సినిమా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్‌గా వాల్మీకి రూపొందుతోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 13 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి.


Click it and Unblock the Notifications











