పూజాహెగ్డేపై డ్రంక్ డ్రైవ్ రూమర్లు.. మేనేజర్ వార్నింగ్

అందాల తార పూజా హెగ్డే వరుస చిత్రాలతో మోత మోగిస్తున్నారు. తక్కువ కాలంలోనే అగ్రహీరోలందరితో కలిసి పనిచేయడం తెలిసిందే. తాజాగా ఆమె నటించిన మహర్షి సినిమా రిలీజై భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. అయితే మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా ఆమెపై ఓ రూమర్ వైరల్ అయింది. ఫంక్షన్‌ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తన మేనేజర్‌తోపాటు పట్టుపడ్డారనే వార్త మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా అ వివాదాస్పద వార్తపై మేనేజర్ వివరణ ఇచ్చారు.

Pooja Hegde manager

పూజా మేనేజర్ హరి మీడియాకు వెల్లడించిన సమాచారం ప్రకారం.. మేము ప్రయాణిస్తున్న వాహనం డ్రంక్ డ్రైవ్‌లో దొరికినట్టు వచ్చిన వార్తలు నిరాధారం. వాటిలో ఎలాంటి వాస్తవాలు లేవు. హైదరాబాద్ సిటీలో ప్రయాణించడానికి పూజా హెగ్డే ఎప్పుడూ సొంత వాహనాలు ఉపయోగించదు. ప్రొడక్షన్‌కు సంబంధించిన వాహనంలోనే ఆమె ప్రయాణిస్తుంది. ఆ రోజు అర్ధరాత్రి 12.20 గంటలకు ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేశాం. అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి అనే విషయాన్ని గుర్తు చేశారు.

Pooja Hegde manager condemns rumours on Maharshi Heroine

ఒకవేళ మేము ప్రయాణిస్తున్న వాహనం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేస్తారు. అలాంటిదేమీ జరుగలేదే. అవాస్తవాలతో కూడిన వార్తలపై హరి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి రూమర్లను వ్యాప్తి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటాం అని పూజా హెగ్డే మేనేజర్ అన్నారు.

ఇదిలా ఉండగా, సూపర్‌స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే నటించిన మహర్షి చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజైన ఘనతను సొంతం చేసుకొన్నది. భారీగా వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X