ఎవ్వరికీ చెప్పొద్దు అంటూ వీడియో బయటపెట్టిన పూజా హెగ్డే.. నెట్టింట వైరల్
ఎవ్వరికీ చెప్పొద్దు అంటూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేసింది హీరోయిన్ పూజా హెగ్డే. అది కూడా ఆమె తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' సినిమా షూట్‌కి సంబంధించిన వీడియో. దీంతో ఈ వీడియో ఆన్‌లైన్ వేదికపై తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ పూజాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
'అల.. వైకుంఠపురములో' సినిమా లోంచి ''బుట్టబొమ్మా'' పాట చిత్రీకరణకు సంబంధించిన స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన పూజా.. ఎవ్వరికీ చెప్పకండి అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చి ఆకట్టుకుంది. మరోవైపు ఇటీవలే విడుదలైన ''బుట్టబొమ్మా'' లిరికల్ సాంగ్ బన్నీ అభిమాన వర్గాల్లో నూతనోత్సాహం నింపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇలా పూజా కూడా తనవంతుగా 'అల.. వైకుంఠపురములో' సినిమా ప్రమోషన్స్‌లో భాగమైంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ''సామజవరాగమన, రాములో రాములా'' పాటలు రికార్డుల సునామీ సృష్టిస్తూ 'అల.. వైకుంఠపురములో' స్థాయిని తెలియజేశాయి. థమన్ అందించిన బాణీలకు ఫిదా అయింది ప్రేక్షకలోకం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సరసన పూజా హెగ్డే పర్ఫెక్ట్‌గా సూట్ అయిందని టాక్ వినిపిస్తోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ జనవరి 12న 'అల.. వైకుంఠపురములో' విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











