నిద్రలేని రాత్రులు, ఆ ప్రయాణం అన్నీ మర్చిపోయా.. లవ్ యూ.. పూజా హెగ్డే
సినిమా అంటే రంగుల ప్రపంచం.. హాయిగా షికార్లు, ఆరామ్ లైఫ్ అని అనుకుంటారంతా. అవుట్‌పుట్ అంతా వచ్చాక పెద్ద తెరపై చూసి వావ్..! దేశ విదేశాల్లోని ఎన్నో లొకేషన్స్ చుట్టివచ్చారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయేదాకా యూనిట్ అంతా అక్కడి సుందరమైన ప్రదేశాల్లో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అని భావిస్తుంటారు. కానీ నిజానికి ఓ సినిమా షూట్ చేయాలంటే బోలెడు కష్టాలుంటాయి. హీరో, హీరోయిన్ సహా యూనిట్ అంతా ఎంతో కష్టపడితే గానీ మనం చూసే ఫైనల్ అవుట్‌పుట్ అంత చక్కగా బయటకు రాదు.
అయితే తాము పడిన కష్టాన్ని ఎవ్వరెలా ఊహించుకున్నా.. ఆ సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిందంటే అంతకంటే ఎక్కువ ఏదీ కాదని యూనిట్ భావిస్తుంది. తాజాగా అలాంటి ఓ సందర్భాన్ని తెలుపుతూ వీడియో పోస్ట్ చేసింది పూజా హెగ్డే. తాను నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'ఎల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్ వస్తుంటే థియేటర్స్‌లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న తాలూకు వీడియో ఇది. ఈ వీడియో పోస్ట్ చేస్తూ తాను పడిన బాధలన్నీ మర్చిపోయానని పేర్కొంది పూజా.

అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన 'దేవత' చిత్రంలో శోభన్ బాబు, శ్రీదేవిలపై తీసిన 'ఎల్లువొచ్చి గోదారమ్మ' పాటను రీమేక్ చేసి ఇప్పటి ఆడియన్స్‌కి వినోదం పంచారు హరీష్ శంకర్. 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'ఎల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్‌ని వరుణ్ తేజ్, పూజా హెగ్డేలపై షూట్ చేశారు. ఈ సాంగ్ వస్తుంటే థియేటర్లన్నీ దద్దరిల్లుతున్నాయి. సాంగ్ చూస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్.
అయితే తాజాగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన పూజా..''నా ప్రయత్నం అంతా ఇందుకోసమే. ఇలాంటి దృశ్యాలు చూస్తే, బాధలన్నీ మరచిపోతాం. మీ ఆనందం, థియేటర్లలో ఇలా డాన్సులు చేయడం చూసి.. మేము గడిపిన నిద్రలేని రాత్రులను, ప్రయాణాన్ని, ఎండలో నిలబడి సినిమాలు చేయడాన్ని అన్నింటినీ మర్చిపోతాం. ఎల్లువొచ్చి గోదారామ్మ లవ్ యూ'' అని పేర్కొంది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











