twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూజాహెగ్డే తొలి రోజు అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో

    |

    హీరోయిన్ పూజాహెగ్డే.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. వరుసపెట్టి స్టార్ హీరోల సరసన నటిస్తూ ఒక్కసారిగా స్టార్ స్టేటస్ పట్టేసింది. ఇటీవలే వరుణ్ తేజ్ సరసన గద్దలకొండ గణేష్ సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈమె.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ఓ సినిమాలో, అలాగే ప్రభాస్ సరసన మరో సినిమాలో నటిస్తోంది. ఈ బిజీ షెడ్యూల్‌లో కూడా యంగ్ హీరో అక్కినేని అఖిల్‌తో వచ్చిన ఛాన్స్ వదలిపెట్టలేదు పూజా.

    మరోవైపు ''అఖిల్, హలో, మిస్టర్ మజ్ను'' సినిమాలతో ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో కనీసం నాలుగో సినిమాతోనైనా బ్రేక్ తెచ్చుకోవాలని కసిగా ఉన్నాడు అక్కినేని అఖిల్. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై స్పెషల్ కేర్ తీసుకొని పూజాహెగ్డేను తీసుకున్నాడు. ఇందుకు గాను ఆమెకు రెమ్మ్యూనరేషన్ కూడా భారీ గానే ఆఫర్ చేశారని తెలుస్తోంది.

     Pooja Hegdes First day experience in Akhil Akkineni sets

    ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేసింది పూజా. దీంతో పూజాకి వెల్‌కం చెబుతూ వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు మేకర్స్. మొదటి రోజు షూటింగ్ స్పాట్ లోని కొన్ని సీన్లతో కూడిన ఈ వీడియోలో క్యారవాన్, పూజా హ్యాపీ నెస్ అన్నీ కనిపించాయి. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    English summary
    Akhil Akkineni Commited with director Bommarillu Bhaskar for his next movie. In this movie Pooja Hegde confirmed as heroine. As per latest talk she has rejected that project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X