ఎక్కడా తగ్గని పూజా హెగ్డే.. బ్లాక్ లియోటార్డ్ లో రచ్చరేపేసిందిగా!
తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న పూజా హెగ్డే తన హాట్ ఫొటోస్ తో రచ్చ రేపుతోంది. తెలుగులో ఇప్పుడు బిజీ హీరోయిన్ గా ఉన్న ఆమె బాలీవుడ్ లో కూడా అనేక సినిమాలు చేస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఆమె ఫొటోస్ షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

ఫ్యాషన్ షోస్ లో
కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన పూజా హెగ్డే తల్లిదండ్రులు ముంబైలో సెటిల్ అయ్యారు. అక్కడే ఆమె జన్మించింది కూడా. చదువుకునే రోజుల్లోనే నటన మీద ఆసక్తితో అనేక ఫ్యాషన్ షోస్ లో ఈ భామ పాల్గొంది.

తమిళ సినిమాతో తెరంగ్రేటం
ఆ ఫ్యాషన్ షోస్ లో పాల్గొన్న క్రేజ్ తో ఆమె ముగమూడి అనే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా కలిసి రాకపోయినా తెలుగులో ఒక లైలా కోసం అనే సినిమా ఛాన్స్ రావడానికి అది ఉపయోగపడింది.

ఏకంగా హృతిక్ సరసన
ఆ తర్వాత తెలుగులో ఆమె ముకుందా అనే సినిమా చేసినా పెద్దగా అవకాశాలు దక్కలేదు. కానీ రెండేళ్ల తరువాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన మొహంజోదారో అనే సినిమాలో నటించే అవకాశం దక్కింది.

దువ్వాడ జగన్నాధం దెబ్బకు
అయితే ఆ సినిమా ఆడకపోయినా దువ్వాడ జగన్నాథం సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఆ సినిమా దెబ్బకు ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.

వరుస హిట్స్ తో
తర్వాత వరుసగా రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దల కొండ గణేష్, అల వైకుంఠ పురంలో సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కస్, బీస్ట్ లాంటి సినిమాలు ఉన్నాయి.

వరుస హిట్స్ తో
తర్వాత వరుసగా రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దల కొండ గణేష్, అల వైకుంఠ పురంలో సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కస్, బీస్ట్ లాంటి సినిమాలు ఉన్నాయి.
Recommended Video

లియోటార్డ్ లవ్
ఇక ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ తో అందరినీ ఆకట్టుకునే ఈ భామ తాజాగా జిమ్నాస్టిక్స్ చేసేందుకు వాడే లియోటార్డ్ అనే ఒక కాస్ట్యూమ్ లో కనిపించి అందరినీ ఆకర్షించింది. లియోటార్డ్ లవ్ అంటూ క్యాప్షన్ పెట్టిన ఈ భామ ఆ బ్లాక్ డ్రెస్ లో తన తొడల అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











