For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రొటీన్ నచ్చట్లేదు.. ఎంజాయ్‌మెంట్‌ కావాలి.. తప్పేముంది.. వామ్మో! పూజాహెగ్డే చూడండి

|
Pooja Hedge Conditions To Makers On Accepting A Movie Project || Filmibeat Telugu

ప్రెసెంట్ హీరోయిన్ పూజా హెగ్డే టైమ్ బాగా నడుస్తోంది. సినిమాల పరంగా టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై వరుస హిట్స్ పట్టేస్తున్న ఈ భామ డిమాండ్స్ కూడా బాగానే ఉన్నాయండోయ్. పారితోషికం విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వసూలు చేస్తున్న పూజా.. సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఉండాల్సిన వాతావరణం విషయంలోనూ బాగానే కండీషన్స్ పెడుతోంది. ఇంతకీ ఆమె పడుతున్న కండీషన్స్ ఏంటి? పూజా డిమాండ్ ఏంటి? వివరాలు చూస్తే..

వరుసపెట్టి స్టార్ హీరోలతో రొమాన్స్

వరుసపెట్టి స్టార్ హీరోలతో రొమాన్స్

యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే వరుసపెట్టి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశం పట్టేసింది. ఇటీవలే మహేష్ బాబు సరసన 'మహర్షి' సినిమా ఆడిపాడిన ఈ అమ్మడు.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అల్లు అర్జున్ తో చిందులేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రభాస్ చిత్ర సెట్స్ పై వాలనుంది.

సినిమా నుంచే నేర్చుకున్నా..

సినిమా నుంచే నేర్చుకున్నా..

తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన పూజా హెగ్డే.. సినిమాల పరంగా తనకు కావాల్సిందేంటనేది వివరించింది. షూటింగ్ కి వెళ్లిన ప్రతీసారి ఓ కొత్త విషయం తెలుసుకుంటానని, ఇంటికెళ్ళాక తిరిగి వాటిని గుర్తుచేసుకుంటానని చెప్పిన ఆమె.. హీరోయిన్ గా ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను సినిమా నుంచే నేర్చుకున్నానని తెలిపింది.

వారం, పది రోజులే.. రొటీన్ నచ్చడం లేదు

వారం, పది రోజులే.. రొటీన్ నచ్చడం లేదు

తన సినిమా విజయాల గురించి స్పందించిన పూజా.. ఒకప్పటిలా ఇప్పుడు సినిమా జయాపజయాల గురించి పట్టించుకోవడం లేదని చెప్పింది. తన సినిమా సినిమా ఘన విజయం సాధించినప్పటికీ, ఆ ఆనందం తనలో వారం, పది రోజులకు మించి ఉండటం లేదని అంటోంది పూజా. ఆ పది రోజుల తర్వాత అంతా రొటీన్ అవుతోందని పేర్కొంటూ తనకేం కావాలో చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.

ఎంజాయ్‌మెంట్‌ కావాలి.. తప్పేముంది

ఎంజాయ్‌మెంట్‌ కావాలి.. తప్పేముంది

ప్రస్తుతం సినిమాలు ఒప్పుకోవాలంటే ఆ సినిమా సెట్స్‌పై ఎలా ఎంజాయ్ చేస్తాననే విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనుకుంటున్నా. సెట్లో తప్పకుండా ఎంజాయ్‌మెంట్‌ ఉంటుందనిపిస్తే సంతకం చేస్తున్నా. ప్రతి సినిమా కోసం కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి సెట్స్‌పై ఎంజాయ్ అనేది ఉండాల్సిందే. నా విలువైన సమయాన్ని అక్కడ పెడుతున్నప్పుడు ఎంజాయ్‌మెంట్ గురించి ఆలోచిస్తే తప్పేముంది? అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది పూజా హెగ్డే.

బాలీవుడ్‌లో పూజా హంగామా

బాలీవుడ్‌లో పూజా హంగామా

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా ఆకర్షిస్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హౌస్ ఫుల్ 4 లో నటిస్తోంది. హౌస్ ఫుల్ సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమాలో కృతి సనన్, అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, బాబీ డియోల్, కృతి కర్భందా, రితీష్ దేశ్ ముఖ్, దగ్గుబాటి రానా తదితరులు నటిస్తున్నారు. నడయాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 25న విడుదల కానుంది.

English summary
Heroine Pooja Hegde now acting with Allu Arjun and Prabhas. In Social media she was posting different photos for her pramotions. In recent mesia meet she says about her future cenema shootings.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more