అల్లు వారబ్బాయికి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన యంగ్ హీరోయిన్.. నెట్టింట వైరల్ పిక్
యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే, అల్లు వారబ్బాయికి పంచ్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు పుట్టిన రోజున స్పెషల్ పిక్ ద్వారా సర్‌ప్రైజ్ చేసింది. పూజా పుట్టిన రోజు సందర్బంగా ఈ పిక్‌ని షేర్ చేసింది 'అల.. వైకుంఠపురములో' చిత్రయూనిట్.

వరుసపెట్టి స్టార్ హీరోలతో రొమాన్స్
ముకుంద సినిమాతో సినీ జర్నీ మొదలుపెట్టిన పూజా హెగ్డే.. వరుసపెట్టి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసేస్తోంది. ఇటీవలే ఎన్టీఆర్ సరసన అరవింద సమేతలో, మహేష్ బాబుతో 'మహర్షి' సినిమాలో, వరుణ్ తేజ్‌తో గద్దలకొండ గణేష్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

పూజా 30వ పుట్టిన రోజు.. బన్నీ యూనిట్
ప్రస్తుతం అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న 'అల.. వైకుంఠపురములో' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది పూజా. అయితే ఈ రోజు (అక్టోబర్ 13) పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్బంగా ఆమె లుక్ పోస్ట్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఆకర్షణీయమైన లేడీ అంటూ స్పెషల్ విషెస్
'అల.. వైకుంఠపురములో' స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ పూజాని ప్రశంసల్లో ముంచెత్తింది. ఆమె హార్డ్ వర్కింగ్ చేసే హీరోయిన్ అని, కొత్త జెనరేషన్ లో అత్యంత ఆకర్షణీమైన లేడీ పూజా హెగ్డే అని పేర్కొంటూ ఈ ఏడాది ఆమె భారీ సక్సెస్‌లు సొంతం చేసుకోవాలని కోరుకుంది.
పంచ్ ఇచ్చేందుకు రెడీ అయిన పూజా
ఇక చిత్రయూనిట్ షేర్ చేసిన తాజా పిక్‌లో చేతికి గ్లౌజులు వేసుకొని కనిపించింది పూజా హెగ్డే. దీంతో ఈ చిత్రంలో ఆమె బాక్సర్ రోల్ పోషిస్తుందేమో అనే సందేహం కలుగుతోంది. అంటే ఈ లెక్కన అల్లువారబ్బాయికి పంచ్ ఇచ్చేందుకు ఆమె రెడీ అవుతోందన్నమాట.

'అల.. వైకుంఠపురములో'
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరోవైపు మహేష్ బాబుతో కూడా
గతంలో మహేష్ 25వ సినిమా మహర్షిలో జోడీ కట్టి బాగా ఆకట్టుకుంది పూజా. ఈ జోడీ సిల్వర్ స్క్రీన్ రొమాన్స్ చూసి మహేష్ అభిమానులు మురిసిపోయారు. దీంతో ఇది గమనించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మహేష్ తదుపరి సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో పూజా హెగ్డేతో ఓ పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











